సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సుడిగాలి సుధీర్?
సుధీర్ అంటే తెలియదేమోకానీ సుడిగాలి సుధీర్ అంటే అందరికీ తెలుసు. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మ్యాజిక్ షోలు చేసే సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. కెరీరేమో కమెడియన్ గా ప్రారంభమైంది. యూత్ లో ఫాలోయింగ్ కూడా బాగా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఎంగేజ్ మెంట్ అయిపోయిందని, సీక్రెట్ గా జరిగిందని చెబుతున్నారు.
ఎన్నో కష్టాలను అనుభవించి మంచి స్థాయికి వచ్చిన సుధీర్.. అవకాశాల్లేక రోడ్డుపై ఉంటూ ఫుడ్ కోసం అల్లాడిన పరిస్థితి నుంచి కోట్లరూపాయల విలువచేసే బంగ్లాను కొనుగోలు చేశాడు. జబర్దస్త్ వల్లే ఈ స్థాయికి వచ్చాడని అందరికీ తెలుసు. అయితే తనకు అన్నంపెట్టిన జబర్దస్త్ ను వదిలేశాడంటూ విమర్శలు వచ్చాయి. సినిమాల్లో అవకాశాలు రావడంతో అటువైపు పయనించాడు. సుడిగాలి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ రేటింగ్స్ కూడా బాగా తగ్గిపోయాయి. సుధీర్ టీమ్ లో ఉన్న శ్రీను, రాంప్రసాద్ ఉండేవారు. రాంప్రసాద్ ప్రస్తుతం జబర్దస్త్ చేస్తున్నప్పటికీ శ్రీను కూడా సినిమాల్లో అవకాశాలు రావడంతో అటువైపే పయనించారు.

సుడిగాలి సుధీర్ -రష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని పట్టించుకోకుండా తన మరదలితో నిశ్చితార్థం కుదుర్చుకున్నాడని ప్రచారం నడుస్తోంది. సొంత మరదలితోనే ఎంగేజ్ మెంట్ అయిందని, త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతోందని తెలుస్తోంది. ఈ వార్తతో సుధీర్-రష్మి ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదుకానీ నెట్టింట మాత్రం వైరలవుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో సుధీర్ బిజీగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications