స్పెషల్ స్పెషల్ హోదా వస్తుంది, వచ్చి తీరాలి: సుజన ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను మించిన ఆదరణ కేంద్రం నుంచి లభిస్తుందని, ఏపీకి స్పెషల్ స్టేటస్ కాదని.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుందని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా పైన చర్చించారు. ఈ సందర్భంగా సుజన విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా కాదని.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ ఉందన్నారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడేందుకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు వస్తాయో, వాటన్నింటినీ సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రత్యేక హోదా పైన నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభలో హామీ ఇచ్చారని, అది వచ్చి తీరాలన్నారు. అయితే, సాంకేతిక సమస్య వచ్చి పడిందన్నారు. దాని గురించి కేంద్రం ఆలోచిస్తోందని చెప్పారు. చట్టంలో పొందుపర్చిన అన్నీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.
కాగా, ఇటీవలి వరకు ప్రత్యేక హోదా వస్తుందని చెబుతున్న టిడిపి నేతలు వరుసగా మాట మార్చుతున్న విషయం తెలిసిందే. హోదా రాదు, వివిధ ప్యాకేజీలతో కూడిన రాయితీలు ఉంటాయని నటి సుజన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అదే సమయంలో ఏపీకి స్పెషల్ స్పెషల్ హోదా అన్న సుజన వ్యాఖ్యలు వెటకారమా అనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications