ప్రత్యేక హోదాపై సుజనా చౌదరి ఇంకా అదే మాట
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా పలువురు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చెబుతున్నప్పటికీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి మాత్రం ఇంకా అదే మాట చెబుతున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు.
సోమవార నెల్లూరు ఆయన మీడియాతో మాట్లాడారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందన్న స్థానిక నాయకుల ఆరోపణలు సరికాదని ఆయన స్పష్టం చేశారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తథ్యమన్నారు. పులికాట్ సరిహద్దు సమస్యపై కేంద్రానికి ఏపీ నివేదిక అందిందని , తమిళనాడు నివేదిక అందితే సమస్యను పరిష్కరిస్తామని సుజనా చౌదరి చెప్పారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు (మంగళవారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
చీఫ్ విప్‌ల సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 30వ తేదీన అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హిందూపురం నియోజకవర్గంలోపలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications