ఇద్దరిదీ తప్పే..! సుజనా చౌదరి సంచలన ట్వీట్ ..!
ఏపీలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్ట్ తర్వాత వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మొదలైన పోరు పరాకాష్టకు చేరుకుంటోంది. ఇప్పటికే సిట్ రిపోర్ట్ తన వాదనను సమర్ధించిందంటూ వైసీపీ, టీడీపీ ఇద్దరూ వాదనలు చేసుకుంటున్నారు. దీన్నే జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మాటలు కాస్తా దాడుల వరకూ వెళ్లిపోయాయి. దీంతో వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ అభాసుపాలవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి (sujana chowdary) ఇవాళ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరస పరిణామాలు ఆవేదన కల్గిస్తున్నాయని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యంగా మాట్లాడడం ఖండించాల్సిన విషయమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే! అని సుజనా చౌదరి తేల్చిచెప్పేశారు. అయితే, వ్యక్తిగత, భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ టీడీపీ క్యాడర్ కు చురకలు అంటించారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరస పరిణామాలు ఆవేదన కల్గిస్తున్నాయి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యంగా మాట్లాడడం ఖండించాల్సిన విషయం - చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే! అయితే, వ్యక్తిగత, భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కక్ష రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సుకు…
— YS Chowdary (Sujana Chowdary) (@yschowdary) February 2, 2026
అలాగే కక్ష రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సుకు ప్రమాదకరమని సుజనా చౌదరి గుర్తుచేశారు. చంద్రబాబు ఇలాంటి ఘటనలను సహించరన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. చట్టబద్ధంగా పరిస్థితిని నియంత్రిస్తారని నమ్మకం ఉందన్నారు. ప్రజల అవగాహనే ఏపీకి శ్రీరామరక్ష అంటూ సుజనా తన ట్వీట్ ముగించారు. ఈ మొత్తం ట్వీట్ ను గమనిస్తే చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు తప్పు, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా టీడీపీ నేతలు ఇంటిపై దాడి చేయడం కూడా తప్పని సుజనా తేల్చేసినట్లయింది. దీంతో సుజనా ట్వీట్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications