వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీటుకోసం తొందరొద్దు: జగన్‌కు సుజన, పవన్ ప్రశ్నపై.. అన్ని భాషల్లో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి, ఇతర టిడిపి ఎంపీలు కలిసి గురువారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైసిపి అధినేత జగన్‌కు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు.

తోందరపాటు పనికి రాదు

తమకు ఏపీ ప్రజలు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారని సుజనా చెప్పారు. రేపే సీట్లో కూర్చోవాలంటే రాజ్యాంగం ప్రకారం కుదరదని వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాము కూడా పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని, ఎవరైనా ఎన్నికలు వచ్చే వరకు ప్రజా తీర్పు కోసం ఆగాలన్నారు. రేపే సీట్లో కూర్చోవాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

ఏపీకి ఏదో మంచి జరగబోతుంది, ఏమిచ్చినా ఓకే: హోదాపై సుజనఏపీకి ఏదో మంచి జరగబోతుంది, ఏమిచ్చినా ఓకే: హోదాపై సుజన

రాజకీయాల్లో ఒకరిని మరొకరు గౌరవించుకుంటే మంచిదని చెప్పారు. ఇది ఎవరికి చెబుతున్నారని విలేకరులు అడగగా.. ఎవరికి చెప్పాలో వారికి అని సుజనా అన్నారు. ఈ వ్యాఖ్యలు జగన్‌ను ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.

Sujana counter to YS Jagan and Pawan Kalyan

బీజేపీపై..

తాము, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నామని సుజన చెప్పారు. మిత్రధర్మం ప్రకారం తామిద్దరం వెళ్తామన్నారు. వారేం చేయాలే అదే చేస్తారని, అలాగే తాము ఏం చేయాలో అదే చేస్తామన్నారు. ఒకరి పైన మరొకరు బురద జల్లుకుంటూ కూర్చుంటే, రైళ్లు పగులగొడితే, ధర్నాలు చేస్తే వచ్చేదేం లేదన్నారు. కేంద్రం ఏపీకి ఏదో విధంగా సాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ భాషలపై...

ప్రత్యేక హోదా కోసం తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని సుజన చెప్పారు. తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ హిందీలు, ఇంగ్లీషులో ప్రత్యేక హోదాపై మాట్లాడి, టిడిపి నేతలపై మండిపడ్డారు. దీని పైనా వారు స్పందించారు. తాము అన్ని భాషల్లో హోదా కోసం విజ్ఞప్తి చేస్తున్నామని కొనకళ్ల నారాయణ అన్నారు.

హోదా లేదు, భారీ ప్యాకేజీ, అమరావతికి 5వేలకోట్లు: నో చెప్పిన బాబు, పవన్‌కు నో రెస్ట్!హోదా లేదు, భారీ ప్యాకేజీ, అమరావతికి 5వేలకోట్లు: నో చెప్పిన బాబు, పవన్‌కు నో రెస్ట్!

ప్రత్యేక హోదా కోసం పవన్ ఉద్యమించడంపై ప్రశ్నించగా, సుజన మాట్లాడుతూ.. అందరిని కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మన ఏపీకి కావాల్సిన వాటిని మనం తెచ్చుకోవడమే అంతిమ లక్ష్యమని చెప్పారు. అది మన బాధ్యత అన్నారు. కనీసం ఐదేళ్ల పాటైనా హోదా కావాలని అడుగుతున్నాని, హోదా కోసం ఎంపీలు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు.

English summary
Union Minister Sujana Choudhary counter to YSRCP chief YS Jagan and Jana sena chief Pawan Kalyan over Special Status to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X