ఏపీలో ఒంటిపూట బడుల తాజా డేట్ ఇదే..!
ఏపీలో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ మేరకు కొత్త తేదీని ప్రకటించింది. ప్రతీ ఏటా మార్చి 15 నుంచి స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది మాత్రం ఈ తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్ధులు ఒంటిపూట బడులకు వెళ్తూనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి మార్చి 18 నుంచి స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ప్రతీ ఏటా చేస్తున్నట్లుగానే ఈసారి కూడా మార్చి 15 నుంచి వేసవి ఒంటిపూట బడులు పెడతారని భావించినా ప్రభుత్వం మాత్రం మూడు రోజులు ఆలస్యంగా అంటే మార్చి 18 నుంచి వీటిని నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ నెల 18 నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షా కేంద్రాలకు పలు స్కూళ్లను కేటాయించారు. అలాగే కొన్ని స్కూళ్లలో కొంత భాగం పదో తరగతి పరీక్షల కోసం కేటాయించారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ నుంచే మిగతా విద్యార్ధులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications