మాతో ట‌చ్‌లో 18మంది టీడీపీ ఎమ్మెల్యేలు: చ‌ంద్ర‌బాబుకు జైలు త‌ప్ప‌దు: సునీల్ దియోధ‌ర్ సంచ‌ల‌నం..!

బీజేపీ నేత‌లు ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు టీడీపీ ల‌క్ష్యంగా కీల‌క ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర స్థాయిలో పార్టీ నేత‌లు చెబుతున్న వాద‌న‌నే..ఇప్పుడు ఏకంగా బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధ‌ర్ తేల్చి చెప్పే సారు. త‌మ‌తో ఏకంగా 18 మండి టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో విలీనం అయ్యారు. ఇక‌, తాజాగా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వెళ్లే 18 మంది ఎవ‌రు.. మిగిలే ఆ అయిదుగురు ఎవ‌ర‌నే చ‌ర్చ మొద‌లైంది.

Recommended Video

    అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
     బీజేపీతో ట‌చ్‌లో 18 మండి టీడీపీ ఎమ్మెల్యేలు..

    బీజేపీతో ట‌చ్‌లో 18 మండి టీడీపీ ఎమ్మెల్యేలు..

    బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. కొద్ది రోజులుగా టీడీపీ నేత‌లు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని బీజేపీ నేత‌లు చెబుతూ వ‌స్తున్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఎంత మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేరేది స్ప‌ష్టం చేస్తున్నారు. అందులో 18 మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీలోకి రావ‌టానికి సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. టీడీపీకి చెందిన న‌లు గురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఇప్ప‌టికే బీజేపీలో చేరారు. ఏకంగా టీడీపీపీ ని బీజేపీలో విలీనం చేసారు. ఇక‌, కొద్ది రోజులు గా ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో ట‌చ్‌లో ఉన్నారనే ప్ర‌చారం మొద‌లైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఢిల్లీ లో బీజేపీ నేత‌ల‌ను క‌లిసార‌నే చ‌ర్చ సాగింది. తాజాగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంకు చెందిన మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దా పురం సూరి బీజేపీలో చేరారు. అదే జిల్లా నుండి టీడీపీ నేత‌లు మ‌రి కొంద‌రు బీజేపీలో చేర‌టానికి సిద్దంగా ఉన్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

    చంద్ర‌బాబుకు జైలు త‌ప్ప‌దు..

    చంద్ర‌బాబుకు జైలు త‌ప్ప‌దు..

    దీనికి కొన‌సాగింపుగా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ మ‌రి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల, అవినీతి వల్ల ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేకుండా పోయిందని దియోధర్ చెప్పుకొచ్చారు. గతంలో పలు సందర్భాల్లో కూడా చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని సునీల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవ‌న్నీ బీజేపీ మైండ్ గేమ్‌లో భాగంగా చేస్తున్న వ్యాఖ్య‌లా ..లేక చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా రాజ‌కీయంగా ఏమైన పావులు క‌దుపుతుందా అనే చ‌ర్చ మొద‌లైంది. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ ప్రారంభించిన అవినీతి వేట‌..అటు వైపు ఢిల్లీ నేత‌ల వ్యాఖ్య‌ల మ‌ధ్య సారూప్యం గ‌మ‌నిస్తున్నారు.

    వెళ్లే 18 మంది ఎవ‌రు..ఉండే అయిదుగురు ఎవ‌రు

    వెళ్లే 18 మంది ఎవ‌రు..ఉండే అయిదుగురు ఎవ‌రు

    ఆంధ్రప్రదేశ్ కో-ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఒక్కో లోక్‌సభ నియో జకవర్గంలో లక్ష మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీలో చేరిన టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేల‌ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా ఆ న‌లుగురు ఎంపీలు త‌మ‌కు స‌న్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల‌తో మంత‌నాలు చేస్తున్నార‌నే వాద‌న ఉంది. కాపు నేత‌లు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు స‌మావేశం ఏర్పాటు చేసుకున్నార‌ని ప్ర‌చారం సాగినా..రెండు రోజుల క్రితం వారంతా చంద్ర‌బాబుతో స‌మావేశ‌మై తాము పార్టీ మారాల‌నే ఆలోచ‌న‌లో లేమ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఇక‌, ఇప్పుడు తాజాగా బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల పైన ఎవ‌రి అంచ‌నాల్లో వారు ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+