ఆదినారాయణ రెడ్డిని కాపాడుతున్నారు : వివేకా హత్యలో ఆయన కుట్ర: సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు..!
Recommended Video

తన తండ్రి హత్య వెనుక ఆదినారాయన రెడ్డి కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని వివేకా కుమార్తె సునీతా రెడ్డి అను మానం వ్యక్తంచేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయన్ను కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకా మృతదేహా న్ని తరలించే సమయంలో సిఐ ఉన్నారన్నారు. అదినారాయణ ను మాత్రం సిట్ ఇప్పటి వరకు విచారించలేదని..దీని పై సిట్ దృష్టి సారించాలని కోరారు.

ఆదినారాయణ రెడ్డి కుట్ర..!
తన తండ్రి వివేకానందరెడ్డి హత్య వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి కుట్ర ఉందన్న అనుమానాలు తమకు ఉన్నాయని, ఆయన్ను మాత్రం చంద్రబాబునాయుడు కాపాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, హత్యకు సంబంధముందని సిట్ భావిస్తున్న వారిలో పలువురికి ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తాను చెప్పినట్టుగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆదినారాయణ రెడ్డిని బాబు కాపాడుకుంటూ వస్తున్నారా.. అని సునీత ప్రశ్నించారు. తన తండ్రి హత్య తరువాత ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయని ఆమె అన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేశా రని, హత్య జరిగిన వెంటనే అక్కడ చేయాల్సిన తన విధులను సీఐ చేయలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆయన మిన్న కుండిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జమ్మలమడుగు లో గెలుపు కోసమే..
జమ్మలమడుగు లో పార్టీ గెలుపు కోసం వివేకానందరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని..ఆ సమయంలోనే హత్య జరిగిందని వివరించారు. 1970 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో వివేకా ఉన్నారని..ప్రతీ గ్రామంలో ఆనయకు పరిచయాలు ఉన్నాయ ని చెప్పుకొచ్చారు. ఆదినారాయణ కు వివేకా ఎంతో సాయం చేసారని వివరించారు. కడప లో పార్టీ గెలపు కోసం వివేకా ప్రయత్నాలు చేస్తున్నారని..జగన్ ను సీయం చేయాలనేది వివేకా లక్ష్యం అని వివరించారు. జమ్మలమడుగు కు వివేకా ఎంపీగా ఉన్న సమయంలో అధికంగా ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించారని గుర్తు చేసారు. వివేకా హత్య వెనుక రాజకీ య సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసారు. ఆదినారాయణ రెడ్డిని విచారించాలని తాను వ్యక్తిగతంగా సిట్ కోరినా..ఇప్పటి వరకు విచారించలేదని పేర్కొన్నారు.

పరమేశ్వర రెడ్డితో వారికి సంబంధాలు..
పరమేశ్వ రెడ్డి తనకు అనారోగ్యం కారణంతో ఆస్పత్రి లో చేరి అక్కడ సిబ్బందితో గొడవ పడి డిస్చార్జ్ అయ్యారని.. తిరి గి అదే ఆస్పత్రిలో చేరటం అనుమానాలను తావిస్తుందన్నారు. పరమేశ్వర రెడ్డి వ్యవహారం అనుమానాస్పదంగా ఉం దని..ఆయన ను టిడిపి లో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు జరిగిన విషయం టిడిపి నేతలే చెబుతన్నారని వివరించా రు. తన తండ్రి చనిపోయిన విషయం ఉదయం 6.40కి సమాచారం ఇచ్చామని.. డెత్ స్పాట్‌లో ఏం జరిగిందో సీఐకి తెలుసన్నారను. సిట్ అధికారులు తమను ఎన్నో ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ సమాధానం ఇచ్చామని చెప్పిన ఆమె, తాను స్వయంగా ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు చేసినా, ఇంతవరకూ ఆయన్ను విచారించలేదని, సిట్ సైతం టీడీపీ అధీనంలోనే పనిచేస్తోందని ఆరోపించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications