వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా హత్య కేసు - ప్రణాళిక మొదలు అన్నీ ఆయనే : సునీత న్యాయవాది వాదనలు..!!

|
Google Oneindia TeluguNews

వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు ప్రణాళిక నుంచి ఆధారాలు లేకుండా చేయటం వరకూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని వాదించారు. దేవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే అధికారులను, సాక్షులను ప్రభావితం చేస్తారని, విచారణ ముగిసేవరకు అతనికి బెయిల్‌ మంజూరు చేయవద్దని అభ్యర్థించారు.

తొలి నుంచి చివరి దాకా ఆయనే..

తొలి నుంచి చివరి దాకా ఆయనే..


వివేకా కుమార్తె సునీత డీజీపీని కలిసిన సందర్భంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి తనకు రెండు కళ్లు లాంటి వారని సీఎం చెప్పినట్లు అప్పటి డీజీపీ తెలిపారంటూ కోర్టుకు నివేదించారు. ఈ సునీత 164 స్టేట్‌మెంట్‌లో చెప్పారన్నారు. మొదటి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన తరువాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. ఇతర నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యాలలో వాదనలు వినేందుకు న్యాయమూర్తి మంగళవారానికి కేసును వాయిదా వేసారు. నిందితులు బెయిల్ పిటీషన్లు మరో సారి కోర్టు ముందుకు వచ్చాయి.

దేవిరెడ్డి కీలకపాత్ర పోషించారంటూ

దేవిరెడ్డి కీలకపాత్ర పోషించారంటూ

దీని పైన విచారణ చేపట్టారు. మొత్తం వ్యవహారంలో దేవిరెడ్డి కీలకపాత్ర పోషించారంటూ కోర్టుకు వివరించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారని... పోస్టుమార్టం చేయకుండా ఆలస్యం చేశారని చెప్పటం తో పాటుగా... కేసు నమోదు చేయవద్దని పోలీసులపై ఒత్తిడి చేశారంటూ సునీత తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. ఏడాది మే 26న తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సమయంలో సాక్షులను ప్రభావితం చేసేలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయ నాయకులూ ఆయన్ను కలిసిన విషయాన్ని కోర్టుకు నివేదించారు. సీబీఐ తనను వేధిస్తోందంటూ ఉదయకుమార్‌ రెడ్డి దర్యాప్తు అధికారిపై కేసు పెట్టారన్నారు.

జ్యడీషియల్ కస్టడీలో

జ్యడీషియల్ కస్టడీలో

ఉదయకుమార్‌ రెడ్డి, దేవిరెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి ముగ్గురూ మిత్రులనే విషయాన్ని న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి స్పందనగా దేవిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి వాంగ్మూలం తప్ప పిటిషనర్‌కు హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు ఎలాంటి ఆధారమూ లేదన్నారు. ఆయనపై 5 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దేవిరెడ్డి గత ఆరున్నర నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారని వివరించారు. సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో అతను బెయిల్‌కు అర్హుడుగా న్యాయవాది వాదనలు వినిపించారు. మిగిలిన వారి వాదనలు వినేందుకు వీలుగా కేసును వాయిదా వేసారు.

English summary
Viveka daughter Sunitha alleged that Devireddy Shankar Reddy is the main culprit in murder case in arguments in the high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X