సన్నీలియోన్ పైనే అందరి దృష్టి...పంటకు తగలదు ఏ దిష్టి!

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu
  Andhra Farmer Creative idea, What's Sunny Leone doing in farms?

  నరదిష్టికి నాపరాయికి అయినా పగిలిపోతుందనేది ఓ నానుడి...ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దిష్టి విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తుంటారు. పంటపొలాల్లో, నూతన కట్టణాల నిర్మాణాల సమయాల్లో వివిధ రకాల దిష్టి బొమ్మలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. అయితే సాధారణంగా దిష్టి బొమ్మలుగా భయంకరంగా ఉండే ఆకారాలనో లేక అసభ్యకరంగా ఉండే బొమ్మలనో పెడుతుండటం కద్దు...

  అయితే నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఏమాలోచించాడో ఏమో కానీ తన పొలం దగ్గర వినూత్నమైన దిష్టి చిత్రం ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దిష్టి తగలకుండా ఆ రైతు పెట్టిన బొమ్మ నర దిష్టిని ఎంత వరకు తప్పికొడుతుందో తెలియని గాని జనాలందరి నోళ్లో మాత్రం బాగా నానుతోంది...ఇంతకీ ఆ రైతు దిష్టి నివారణకు పెట్టిన బొమ్మ ఏంటంటే...ఒకనాటి వరల్డ్ పోర్న్ స్టార్...నేటి బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్...ఏంటి ఆశ్చర్యంగా ఉందా?...కాబట్టే కదా...అందరూ ఇదే విషయం వింతగా చెప్పుకుంటున్నారు...ఒక్క సన్నీ లియోన్ పిక్చరే కాదండీ...మళ్లీ దానికో క్యాచీ క్యాప్షన్ కూడా పెట్టాడీ రైతు...ఈ విచిత్రం ఎక్కడో...ఏంటో చూసేయండి మరి...

   థింక్ ఢిఫరెంటా...అదే నా ఈ రైతు తత్వం...

  థింక్ ఢిఫరెంటా...అదే నా ఈ రైతు తత్వం...

  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల్లో రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటి కాయగూరల సాగు చేపట్టారు. మొక్కలు ఏపుగా పెరగడంతో దారి వెంబడి పోయేవారి దృష్టంతా పంట పడుతోందట. ఇది గమనించిన ఓ రైతు...తన పంటలకు దిష్టి తగలకుండా ప్రముఖ శృంగార తార సన్నీలియాన్‌ అర్ధనగ్న పోస్టర్‌ను అక్కడ ఏర్పాటు చేశారు.

  కేవలం పోస్టరే కాదు...క్యాప్షన్ కూడా

  కేవలం పోస్టరే కాదు...క్యాప్షన్ కూడా

  ఆ క్రియేటివ్ రైతు తన పొలంలో సన్నీ లియోన్ సెమీ న్యూడ్ పోస్టర్ పెట్టడమే కాదు...దానిపై ‘ఒరేయ్‌ నన్ను చూసి ఏడవకురా!?'...అంటూ క్యాప్షన్ కూడా రాయించారు. ఇంకేముంది అటువైపు వెళ్లే వారి దృష్టంతా పంటపై కాకుండా ఆ పోస్టర్‌పై పడుతోంది...దీంతో నర దృష్టిని బాగా గమనించిన ఆ రైతు జనాలందరికి సన్నీలియోన్ సొగసు చూడటమే సరిపోయింది...ఇంక తన పంట నెవరూ పట్టించుకోవడం లేదని నమ్మకం కుదరడంతో తన ఐడియాకు తానే మురిసిపోయాడట.

   రైతు చర్యపై చర్చలు...సెటైర్లు..

  రైతు చర్యపై చర్చలు...సెటైర్లు..

  దీంతో ఈ ఐడియా వేసిన రైతును తోటి రైతులే కాదు ఆ దారిన పోయే జనాలందరూ అభినందిస్తున్నారంట. నర దిష్టిని నిరోధించడం కోసం సన్నీ లియోన్ బొమ్మ పెట్టి జనాల దృష్టి గాగానే మళ్లించాడని...ఇందుకోసం ప్రజానాడి కూడా బాగానే పసిగట్టాడని నవ్వుకుంటున్నారట. మరి కొందరేమో దిష్టి తగలకుండా భయంకరమైన బొమ్మలు పెడతారు...మరి ఇతగాడు సన్నీ లియోన్ బొమ్మ పెట్టడంలో ఆంతర్యమేమిటి...ఆవిడ అంత భయంకరమైదనా?...లేక ఏ ఉద్దేశ్యంతో రైతు ఆ బొమ్మ పెట్టాడో అని లాజిక్ లు లాగుతున్నారట...ఏమైతేనేం ఈ రైతు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.

  ఐడియా అదిరింది...పంటనెవరూ చూడటం లేదు...

  ఐడియా అదిరింది...పంటనెవరూ చూడటం లేదు...

  సరే ఎవరేమైనా అనుకోని...నా ఐడియా నాకు ముద్దు అంటున్నాడట రైతు...ఏ ఐడియా అయినా పని తేలిగ్గా అవడం కోసమేనని...ఏ బొమ్మ పెట్టామన్నది కాదని...పనయిందా లేదా అనేదే ముఖ్యమని పోకిరి పంచ్ డైలాగు గుర్తుచేస్తున్నాడట...సన్నీ లియోన్ బొమ్మతో జనాల దృష్టంతా పోస్టర్ మీదే తప్ప పంట వైపు కన్నెత్తి చూడకపోతుండటంతో చుట్టు పక్కల రైతులు కూడా మన వాడి వాదననే బలపరుస్తున్నారట...ఈ సక్సెస్ఫుల్ ఎఫెక్ట్ తో ఇంకే ఏ ఏ తారలు ఎక్కడెక్కడి పొలాల్లో దర్శనమిస్తారో నని జనాలు జోకులేసుకుంటున్నారు...అదండి...సన్నీ లియోన్...నరదిష్టి...జనం దృష్టి...కథాకమామీషు...

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A Nellore district farmer who arrange Sunny leone Scarecrow to divert evil eye on his farm...The farmer's action became viral in social media now.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి