చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ-బాలకృష్ణతో కలిసి వెళ్లిన సూపర్ స్టార్..
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ ఏపీకి వచ్చారు. విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన రజనీకాంత్ ను హీరో నందమూరి బాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ విజయవాడకు పయనమయ్యారు. ఇవాళ విజయవాడలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ చెన్నై నుంచి వచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
విజయవాడకు చేరుకున్న రజనీకాంత్ కాసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం భోజనం పూర్తి చేసుకుని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బాలకృష్ణ రజనీకాంత్ ను చంద్రబాబు నివాసానికి స్వయంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రజనీకాంత్ ఇద్దరూ పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణతో కలిసి తాజా పరిస్ధితులపై మాట్లాడుకున్నారు.

సాయంత్రం ఐదు గంటలకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు చంద్రబాబు, రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ ముగ్గురూ కలిసి వెళ్లబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు.
గతంలోనూ పలుసార్లు చంద్రబాబు, రజనీ కాంత్ భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి మాత్రం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చంద్రబాబు, బాలకృష్ణ స్వయంగా ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో రజనీ కూడా సంతోషంగా వచ్చేందుకు అంగీకరించారు.












Click it and Unblock the Notifications