తిరుమలలో తలైవా: శ్రీవారికి కానుకగా ఏం సమర్పించారంటే..?
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
కాగా సూపర్‌స్టార్ రజినీకాంత్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట భార్య లత, కుమార్తె ఐశ్వర్య, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భార్యతో కలిసి శ్రీవారికి తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు. తన బరువుకు సరిపడేలా 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలను స్వామివారికి సమర్పించారు రజినీకాంత్. 82 కిలోలతో లత అవే వస్తువులను సమర్పించారు.

దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో రజినీకాంత్, ఆయన కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం పలికారు అర్చకులు. తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన రజనీకాంత్‌తో ఫొటోలు దిగారు. ఆలయం లోనికి వెళ్తున్నప్పుడు కూడా మహాద్వారం వద్ద ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భక్తులు ఎగబడటం కనిపించింది.
రజినీకాంత్ 75వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు వేడుకలను చెన్నైలో ఘనంగా జరుపుకొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైలర్ 2 సినిమాలో నటిస్తోన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. జైలర్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫిల్మ్ ఇది.

కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 67,202 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,864 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications