ఏపీ పిటీషన్ పై కేంద్రం- తెలంగాణకు సుప్రీం నోటీసులు..!!

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ విభజన చట్టం అమలు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. విభజన చట్టంలో పేర్కొన్ని 9, 10 షెడ్యూల్ లోని సంస్థలను విభజించాలని కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సుప్రీంలో ఈ విభజన జరగకపోవటం కారణంగా జరిగిన నష్టాన్ని వివరించింది. ఈ రెండు షెడ్యూల్ సంస్థల విలువ దాదాపు రూ 1,42,601 కోట్లు గా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. లక్ష మందికి పైగా ఉద్యగులు అనిశ్చి స్థితిలో ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. దీని పైన సుప్రీంకోర్టు కేంద్రంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్లపైన న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. 2014లో ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ లో ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించారు. అందులో పేర్కొన్న విధంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ రెండు షడ్యూళ్లకు సంబంధించి దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం సుప్రీంకి నివేదించింది. విభజన అంశంలో తెలంగాణ నుంచి సహకారం లేదని కోర్టుకు వివరించింది. దీంతో విభజన వ్యవహారం ఆలస్యం జరుగుతోందని పేర్కొంది. ఈ సంస్థలను వెంటనే చట్టం ప్రకారం విభజన జరిగేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంను కేంద్రం కోరింది.

Supreme Court issues notices for Central and TS Govt on AP Petition on Reorgnasiation Act Implementation

2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9, 10 లో ఉన్న సంస్థల విభజనకు కేంద్రం షీలాబీడీ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు సంస్థల విభజనకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. కానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం లేకపోవటం విభజన ప్రక్రియ నిలిచిపోయింది. కేంద్రం నియమించిన కమిటీ కాల పరిమితి ముగిసింది. ఆర్టీసీతో పాటుగా మరి కొన్ని సంస్థలకు సంబంధించి ఇంకా కొన్ని అంశాల్లో అస్పష్టత కొనసాగుతోంది. ఈ రెండు షెడ్యూళ్లలోని సంస్థలను వెంటనే విభజించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంను కోరింది. ఇది ఏపీ ప్రజల ప్రాధమిక హక్కులను ఉల్లంఘించటమేనని ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+