అమరావతి విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎస్‌ఎల్‌పీకి నంబర్ కేటాయించింది. అమరావతే రాజధానిగా కొనసాగించాలని.. ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపించాలని ఆదేశిస్తూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై గత నెలలో ఏపీ ప్రభుత్వం 2వేల పేజీలతో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నాక సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎస్‌ఎల్‌పీకి నంబర్ కేటాయించింది.
మరోవైపు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం.. మరో పిటిషన్‌పై తుది వాదనలకు గడువు నిర్ణయించడంతో గురువారం విచారణ జరిగే అవకాశం లేదు. తర్వాత రోజైనా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీజేఐ ఎదుట దాఖలు చేసే టిషన్ల జాబితాలో చేర్చాలని రిజస్ట్రీని కోరారు. ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదులైన రైతులకు ఎస్‌ఎల్‌పీ కాపీని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ఆన్‌లైన్‌లో పంపించారు.

ప్రస్తుతం అమరావతి రైతులు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో 60 రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నుంచి గత నెల 12వ తేదీన ప్రారంభమైన యాత్ర అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవాలయంవద్ద ముగియనుంది. ఇప్పటివరకు వారు 36రోజులపాటు యాత్ర చేశారు. దారిపొడవునా ప్రజల నుంచి మద్దతు వ్యక్తమవుతుండటంపై రైతులు ఆనందపరవశులవుతున్నారు. మరోవైపు పాదయాత్రకు వైసీపీ నుంచి అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయంటూ రైతులు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications