మాజీ సీజేఐ ఎన్వీ రమణకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - ఆ ఆదేశాలు చెల్లవ్..!!
అమరావతి: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హయాంలో జారీ చేసిన కీలక ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అప్పట్లో ఆయన జారీ చేసిన ఆదేశాలు చెల్లబోవని తెలిపింది. తన పదవీకాలం ముగుస్తోందనగా జస్టిస్ ఎన్వీ రమణ జారీ చేసిన ఆదేశాలు అవి. వాటిని వెనక్కి తీసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

శాశ్వత ఉద్యోగిగా..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టులో పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. తన పదవీ కాలం చివరి వారంలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు చేసింది. తెలుగు వ్యక్తి ప్రసన్నకుమార్ సూర్యదేవరను సుప్రీంకోర్టు శాశ్వత ఉద్యోగిగా నియామకాన్ని జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తాజా ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రసార భారతిలో..
ప్రసన్నకుమార్ సూర్యదేవర మాతృసంస్థ.. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ. ప్రసార భారతిలో ఆయన తెలుగు అనువాదకుడిగా కేరీర్‌ను ప్రారంభించారు. అనంతరం డెప్యుటేషన్ మీద పలు మంత్రిత్వ శాఖలో పని చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా, రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ వద్ద విధులను నిర్వర్తించారు. 2015లో ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా నియమితులయ్యారు.

రాజకీయ దుమారం..
అప్పట్లో ఆయన నియామకం రాజకీయంగా దుమారానికి దారి తీసింది. 2015లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రసన్నకుమార్ సూర్యదేవరను అసెంబ్లీ కార్యదర్శిగా నియమించగా- లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దీన్ని తప్పు పట్టారు. ఆయనను మాతృసంస్థ ఆకాశవాణికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి వ్యతిరేకించారు. దీని తరువాత 2021లో ప్రసన్నకుమార్ ప్రసారభారతి జాయింట్ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు.

అదనపు రిజిస్ట్రార్‌గా హోదాలో..
అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ- ఆయనను సుప్రీంకోర్టులో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. ఈ మేరకు తన పదవీ కాలం ముగియడానికి కొద్దిరోజుల ముందు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా కన్సల్టెంట్ ఓఎస్డీగా అపాయింట్ చేశారు. అదనపు రిజిస్ట్రార్ హోదాను ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ వెనక్కి తీసుకున్నారు. ప్రసన్నకుమార్‌ను మళ్లీ మాతృసంస్థ ప్రసార భారతికి రీప్యాట్రియేట్ చేశారని జాతీయ మీడియా వెల్లడించింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications