ఏపీలో ఆ బీచ్ ఫెస్టివల్ మామూలుగుండదు.. మూడురోజులు తగ్గేదేలే!

ఏపీ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే దసరాకు, మైసూర్ ఉత్సవాన్ని తలదన్నేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, రాష్ట్రంలోని మిగతా పర్యాటక ప్రాంతాల మీద కూడా దృష్టి సారిస్తుంది. త్వరలో బాపట్ల సూర్యలంక బీచ్ లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు రెడీ అవుతుంది.

సూర్యలంక బీచ్ ఫెస్టివల్
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 26,27,28 తేదీల్లో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం కల్పించేందుకు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో వివిధ ప్రదేశాల్లో ఫ్లాష్ మాబ్స్ నిర్వహించేందుకు ఏపీటీడీసీ సన్నద్ధమైంది. టూరిజం అండ్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫార్మేషన్ థీమ్ తో పర్యాటకానికి ప్రచారంతో పాటు యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఈ ఫ్లాష్ మాబ్స్ నిలవనున్నాయి.

Suryalanka Beach Festival Promotion with flash mobs aptdc plan

బీచ్ ఫెస్టివల్ ప్రచారానికి ఫ్లాష్ మాబ్స్
సూర్యలంకతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్ లలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫ్లాష్ మాబ్స్ నిర్వహించి యువతలో ఉత్సాహం కలిగించడంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవం, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రదర్శించనున్నామని ఏపీటీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫ్లాష్ మాబ్స్ ద్వారా ప్రజలను సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు వచ్చేలా ఆకట్టుకోవటం లక్ష్యమని పేర్కొంది.

ఫ్లాష్ మాబ్ లలో పాల్గొన్న విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా సత్కారం
ఇప్పటికే ఎస్ఆర్ఎం, కేఎల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు ఫ్లాష్ మాబ్ లకు ధృవీకరించినట్లు స్పష్టం చేసింది. మరికొన్ని యూనివర్సిటీలు తమ ఆసక్తిని ప్రదర్శించాయని, ధృవీకరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా ఏపీటీడీసీ పేర్కొంది. ఫ్లాష్ మాబ్స్ లో పాల్గొన్న విద్యార్థులను సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే రోజున సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సత్కరించనున్నామన్నారు.

సూర్యలంక బీచ్ ఫెస్టివల్ లో అదిరిపోయే ఈవెంట్స్
సుందరమైన సూర్యలంక బీచ్ ఫెస్టివల్ లో పర్యాటకులను కట్టి పడేసే అనేక ఈవెంట్స్ ఉన్నాయని పేర్కొంది. సందర్శకులకు వాటర్ స్పోర్ట్స్, బీచ్ సైడ్ గేమ్స్, హౌస్ బోట్ రైడ్స్, జీడిపప్పు తోటల సందర్శన, స్థానిక సీ పుడ్ వంటకాలు, బ్యాక్ వాటర్ ఎక్స్ ప్లోరేషన్స్ తో పాటు ఆహ్లాదకరమైన అనుభవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీల కచేరీలు, తాటికల్లు రుచి తదితర కార్యకలాపాల ద్వారా విభిన్న అనుభవాలను అందిస్తామని ఏపీటీడీసీ వెల్లడించింది.

సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు వివిధ రాష్ట్రాల నుండి సందర్శకులు
ఫ్లాష్ మాబ్‌లలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయాల నిర్వాహకులు [email protected] కు తమ వివరాలు పంపించాలని ఏపీటీడీసీ నేడు ఒక ప్రకటనలో పేర్కొంది. పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వేడుకకు ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశముందని అంచనా వేసింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా యువత ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో సుస్థిర పర్యాటకాభివృద్ధికి బాటలు వేస్తాయని పేర్కొంది. వివరాలకు ఇన్ స్టాగ్రామ్ లోని @andhrapradeshtourismను ఫాలో అవ్వాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+