సూర్యలంక బీచ్ ట్రాజెడీ: మరో విద్యార్థి మృతదేహం లభ్యం (పిక్చర్స్)
గుంటూరు: గుంటూరు జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో గల్లంతైన వడ్లమూడి విజ్ఝాన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో కొల్లిపరకు చెందిన ఆళ్ల శ్రీనివాస రెడ్డి (19) మృతదేహాం తీరానికి కొట్టుకుని వచ్చింది. శనివారం తెల్లవారు జామున అతని శవం ఒడ్డుకు వచ్చింది. మృతదేహాన్ని బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
సముద్రంలో గల్లంతైన మరో విద్యార్థి జయదేవ్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్రవారంనాడు ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు తీరానికి కొట్టుకుని వచ్చిన విషయం తెలిసిందే. సముద్ర స్నానం కోసం 13 మంది విద్యార్థులు శుక్రవారం సూర్యలంక తీరానికి వెళ్లగా నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్‌కు సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. మొత్తం 13 మంది విద్యార్థులు శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సముద్రంలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి శవాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.

సముద్ర తీరంలో మృతదేహం
సూర్యలంక బీచ్ వద్ద నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతు కాగా ఇద్దరి శవాలు శుక్రవారంనాడే ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. ఓ మృతదేహం తీరంలో ఇలా..

గాలింపు చర్యలు...
ఇద్దరి శవాలు ఒడ్డుకు కొట్టుని రాగా, మరో ఇద్దరు విద్యార్థులు శ్రీనివాస్ రెడ్డి, జయదేవ్‌ల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. మరణించినవారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కృష్ణ ప్రసాద్ ఇతనే...
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంభొట్లవారిపాలెంకు చెందిన గుడివాడ కృష్ణప్రసాద్ సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. అతని మృతదేహం శుక్రవారం తీరానికి కొట్టుకుని వచ్చింది.

మహేష్ రెడ్డి ఇతనే...
సముద్రంలో గల్లంతై నల్లగొండ జిల్లాకు చెందిన మహేష్ రెడ్డి మృతి చెందాడు. అతని మృతదేహం శుక్రవారం తీరానికి కొట్టుకుని వచ్చింది.

శ్రీనివాస్ రెడ్డి ఇతనే...
గల్లంతైన మరో బిటెక్ విద్యార్థి శ్రీనివాస్ రెడ్డి మృతదేహం శనివారం తెల్లవారు జామున సముద్ర తీరానికి కొట్టుకొని వచ్చింది.

జయదేవ్ కోసం ఇంకా గాలింపు...
గుంటూరుకు చెందిన బిటెక్ విద్యార్థి జయదేవ్ కోసం ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయి. శుక్రవారం సముద్రంలో గల్లంతైనవారిలో అతను ఉన్నాడు.

ఇంజనీరింగ్ విద్యార్థులు
విద్యార్థులంతా వడ్లమూడి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినవారు. శుక్రవారం ఉదయం వారు సూర్యలంక సముద్ర తీరానికి స్నానానికి వెళ్లారు.

ఒకే తరగతి విద్యార్థులు..
సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లిన విద్యార్థులంతా మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు.












Click it and Unblock the Notifications