మీరే ఫస్ట్: బాబు ప్రభుత్వానికి సుష్మ ప్రశంస, రాజధానిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వారాజ్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రవాస భారతీయులను ఆకర్షించడంలో ఏపీ ప్రభుత్వం ముందు ఉందని, అద్భుతంగా పని చేస్తోందని మంగళవారం కితాబిచ్చారు.
ప్రవాస భారతీయ దివస్ సదస్సు తేదీలను ప్రకటించాక ఆమె మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశం ఏర్పాటు చేయించాలని ఏపీ ప్రభుత్వం తనను కోరిందని చెప్పారు. త్వరలోనే విదేశీ పెట్టుబడిదారులు, ఏపీ ప్రభుత్వం సమావేశం కావడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

రాజధానిలో సాఫ్టువేర్ సంస్థలు
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో సాఫ్టువేర్ సంస్థలను ఏర్పాటు చేస్తామని నాట్స్ ఉపాధ్యక్షులు మన్నవ మోహన్ కృష్ణ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఆయన మంగళవారం రాత్రి గుంటూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సభాపతి కోడెల శివప్రసాద రావుతో భేటీ అయ్యారు.
ఏపీ రాజధాని ప్రాంతంలో సాఫ్టువేర్ రంగాలను విస్తృత పర్చాలని కోడెల ఆయనను కోరారు. దీనికి మోహన్ కృష్ణ స్పందిస్తూ... మన దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్నారైలు సాఫ్టువేర్ వ్యాపారంలో ఉన్నారని, వారంతా అమరావతి ప్రాంతంలో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతంలో యువతకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. 13 జిల్లాలకు ఎన్నారైలు తమవంతు సహకారం అందిస్తారన్నారు.












Click it and Unblock the Notifications