దినకరన్ దెబ్బకు మరో మంత్రి బలి: ఆంధ్ర మంత్రి ఎవరు? వచ్చి పోయేది!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో చక్రం తప్పాలని ప్రయత్నించిన అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ టీటీవీ దినకరన్ కు చుక్కలు కనపడుతున్నాయి. ఆయన దెబ్బకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నానా తిప్పలుపడుతోంది.

కొత్తగా టీటీవీ దినకరన్ కారణంగా మరో మంత్రి ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని అరెస్టు అయిన టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు వివిద కోణాల్లో విచారిస్తున్నారు.

మంత్రికి చుట్టుకుంది

మంత్రికి చుట్టుకుంది

తాజాగా టీటీవీ దినకరన్ కారణంగా మరో నాయకుడు బలి అయ్యే అవకాశం ఉందని తాజాగా వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రి ఉదుమలై రాధాకృష్ణన్ ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో సహకరించారని వెలుగు చూసింది.

అక్కడి నుంచి వచ్చింది

అక్కడి నుంచి వచ్చింది

మంత్రి ఉదుమలై రాధాకృష్ణన్ దినకరన్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి నగదు సమకూర్చారని ఢిల్లీ పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా రెండాకుల చిహ్నం తమకే కావాలని టీటీవీ దినకరన్ పావులు కదిపారని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ పోలీసులు

ఇప్పటికే చెన్నైలో టీటీవీ దినకరన్ కు చెందిన అనేక మంది సన్నిహితులను ఢిల్లీ పోలీసు అధికారులు విచారించి వివరాలు సేకరించారు. ఇప్పుడు సీన్ ఆంధ్రప్రదేశ్ కు మారడంతో అక్కడి ఓ పార్టీ సీనియర్ నాయకులకు దడపుడుతోందని తెలిసింది.

సీన్ మారిపోయింది

సీన్ మారిపోయింది

మొత్తం మీద ఇన్ని రోజులు తమిళనాడు, కర్ణాటక, పుదచ్చేరికి పరిమితం అయిన టీటీవీ దనకరన్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. నిత్యం చెన్నైకి వచ్చి వెలుతున్న ఓ మంత్రికి ఈ కేసులో సంబంధం ఉందని సమాచారం.

చాలు దేవుడా

చాలు దేవుడా

టీటీవీ దెబ్బకు ఇంత కాలం ఆయనకు సన్నిహితంగా ఉన్న నాయకులు కొందరు దూరం అయ్యారని వెలుగు చూసింది. అయితే ఆయన బినామీలు మాత్రం చెన్నైలో విచారణ జరుగుతున్నా ఆయన్ను కలవడానికి అనేక ప్రయత్నాలు చేశారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu: Suspected Minister Udumalai Radhakirushanan also involved in TTV Dinakaran's EC bribe case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి