ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు - 8 సంవత్సరాల బాలుడికి..!!
దేశంలో క్రమేణా మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు సైతం ఒక వైపు పెరుగుతున్న వేళ..మంకీపాక్స్ అనుమానిక కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్ అనుమానిత కేసులు రాగా.. కేరళలో నాలుగు కేసులు నిర్దారించారు. తాజాగా, ఢిల్లీ..హిమాచల్ ప్రదేశ్ లోనూ మంకీపాక్స్ నిర్దారణ అయింది. ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ బయట పడుతున్నాయి. ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో గుర్తించారు.

8 సంవత్సరాల బాలుడిలో
ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు..... ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మంకీపాక్స్ పై ప్రభుత్వాల అప్రమత్తం
ఇప్పటికే కేంద్రం మంకీపాక్స్ పైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు..చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ విధి విధానాలు ఖరారు చేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోనూ కామారెడ్డి జిల్లాలో ఒక మంకీపాక్స్ కేసు నమోదు కాగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనుమానితుడి నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేలోని ఎన్‌ఐవికి పంపించారు.

నివేదికలు వచ్చినాక నిర్దారణ
ఇక కామారెడ్డి జిల్లాలో ఈ మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి నమూనాలలో నెగిటివ్ గా తేలింది. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంకీ పాక్స్ గా నిర్దారణ అయిన కేసులు లేవు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తించిన కేసుకు సంబంధించి పూర్తి నివేదికలు వచ్చిన తరువాతనే ఆ బాలుడికి మంకీపాక్స్ అవునా..కాదా అనేది నిర్దారణ కానుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications