Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రఘురామ కూడా సస్పెండ్ ? సుప్రీం తీర్పుతో పీవీ సునీల్ షాకింగ్ ..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ రాజద్రోహం కేసులో అరెస్టు అయిన తర్వాత సీఐడీ కస్టడీలో హింసకు గురైన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. రఘురామపై గతంలో దాడి చేసిన వ్యవహారంలో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కూటమి సర్కార్ తాజాగా ఇందుకు బాధ్యుడైన అప్పటి సీఐడీ ఛీఫ్, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పీవీ సునీల్ కుమార్ ను విచారణకు పిలిపించింది. ఈ విచారణకు హాజరైన పీవీ సునీల్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశమవుతోంది.

రఘురామకృష్ణంరాజుపై కస్టడీ దాడి కేసులో తనను పోలీసులు విచారణకు పిలిపించడానికి ముందే సస్పెండ్ చేసిన వ్యవహారంపై ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మేరకు సంచలన పోస్ట్ పెట్టారు. "దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి" అని పీవీ సునీల్ పోస్టు పెట్టారు.

Suspend Him Too IPS PV Sunil Kumar Demands Raghurama Raju s Removal for Fair Probe

అయితే ఇక్కడ పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది అనుమతి లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారని. అయితే తాజాగా రఘురామరాజు ఇండ్ భారత్ సంస్ధ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే విచారణకు మాత్రం నోటీసులు ఇచ్చి పిలవలేదు.

Suspend Him Too IPS PV Sunil Kumar Demands Raghurama Raju s Removal for Fair Probe

అదే సమయంలో సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై కోర్టు స్టే ఇచ్చింది. దాన్ని తాజాగా ఎత్తేసింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నోటీసులు ఇవ్వలేదనే కారణంతో కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు తేల్చేచెప్పేసింది. దీంతో సీబీఐ ఈ కేసులో దర్యాప్తు కొనసాగించడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి రఘురామరాజును తప్పించాలంటూ పీవీ సునీల్ ఈ పోస్టు ద్వారా ప్రభుత్వాన్ని పరోక్షంగా కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+