భార్య హత్య: సస్పెన్షన్‌లో ఉన్న ఎస్సై సరెండర్ (పిక్చర్స్)
హైదరాబాద్: సస్పెన్షన్‌లో ఉన్న ఎస్సై తన భార్యను విచక్షణారహితంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనతు కత్తితో పొడిచి భార్యను హత్యచేశాడు. అనంతరం పోలీసుస్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు సస్పెన్షన్‌లో ఉన్న ఎస్‌ఐ కావటం గమనార్హం.
హైదరాబాదులోని కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతానగర్‌లో శుక్రవారం పట్టపగలు ఈ హత్యోదంతం జరిగింది. కడపకు చెందిన సౌజన్య (36), భానుప్రకాష్ 2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గతంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్‌లో భానుప్రకాష్ ఎస్‌ఐగా పనిచేశాడు.
సుదీర్ఘకాలం సిక్ లీవ్‌లో ఉండటం వల్ల సంవత్సరం క్రితం ఇతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వీరి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం వీరు సమతానగర్‌లోని ప్రసాద్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతుండేది.

కత్తి కొనుక్కుని వచ్చి...
శుక్రవారం ఉదయం భానుప్రకాష్, సౌజన్య దంపతులు తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. కొద్దిసేపటి తర్వాత కొడుకు, కూతుర్ని తీసుకుని బయటకు వెళ్లిన భానుప్రకాష్ వారిని ఆల్విన్‌కాలనీలోని బంధువుల ఇంట్లో దించి వచ్చాడు. ఆ తర్వాత కత్తి కొనుక్కుని ఇంటికి వచ్చాడు.

బెడ్రూంలో భార్యపై దాడి
బెడ్‌రూమ్‌లో ఉన్న భార్యను భానుప్రకాష్ దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ సౌజన్య అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత నిందితుడు కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

వ్యాపారం చేశాడు..
తాను ఉద్యోగానికి సెలవు పెట్టి వ్యాపారం చేయాలని ప్రయత్నం చేశానని, ఈ క్రమంలో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యానని భానుప్రకాష్ పోలీసులకు తెలిపాడు.

వ్యాపారంలో కలిసి రాలేదు...
వ్యాపారం కలిసి రాక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పాడు. సౌజన్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. .












Click it and Unblock the Notifications