వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Cabinet : బుగ్గన వారసుడెవరు ? ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ ! జగన్ కు పెను సవాల్ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రుల్ని రాజీనామా చేయాలని కోరబోతున్నారు. ఆ తర్వాత కొత్త కేబినెట్ మంత్రులకు సమాచారం ఇస్తారు. అనంతరం ఈ నెల11న కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. అయితే ఇందులో కీలకమైన ఆర్ధికశాఖను జగన్ ఎవరికి అప్పగించబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితుల్లో మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తూ నెట్టుకొస్తున్న ఆర్ధికమంత్రి బుగ్గన వారసుడెవరన్న దానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

కొత్త ఆర్ధికమంత్రి ఎవరో ?

కొత్త ఆర్ధికమంత్రి ఎవరో ?

ఏపీ కేబినెట్లో 25 మంది మంత్రులున్నా వారిలో అత్యంత కీలకమైన మంత్రి ఆర్ధికమంత్రే. గత ప్రభుత్వాలతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే అసలే అప్పులపాలైన రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ నిత్యం చూసేది ఆర్ధికశాఖ వైపే. అందులోనూ తనకు అత్యంత విశ్వసనీయుడైన సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ కు ఆయన పగ్గాలు అప్పగించారు. దీంతో ఆయన తనకు అప్పగించిన బాధ్యతల్ని ఎన్నో విమర్శల్ని తట్టుకుంటూ మూడేళ్లుగా సమర్ధంగా నిర్వహించారు. అయితే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేబినెట్ ప్రక్షాళన చేస్తుండటంతో ఇప్పుడు బుగ్గనకు వారసుడిని వెతుక్కోవాల్సిన పరిస్ధితి.

సవాల్ స్వీకరించేదెవరు ?

సవాల్ స్వీకరించేదెవరు ?


ఏపీలో ప్రస్తుత పరిస్ధితుల్లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రానికి నిధులు తీసుకురావడం ఓ ఎత్తయితే, రాష్ట్రంలో కేటాయింపుల విషయంలోనూ అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే విమర్శలు తప్పవు. ముఖ్యంగా భారీ ఎత్తున సంక్షేమాన్ని అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతకాల్సిందే. లేకపోతే సమస్యలు తప్పవు. దీంతో ఇప్పుడు కాబోయే అర్ధికమంత్రి సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండేవారు కావాలని జగన్ కోరుకుంటున్నారు.

ఆర్ధిక మంత్రి రేసులో ఆ ముగ్గురు

ఆర్ధిక మంత్రి రేసులో ఆ ముగ్గురు

ప్రస్తుతం ఆర్ధికమంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయన స్ధానంలో ఆర్ధికమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముగ్గురి పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఇందులో ఒకరు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి కాగా... మరొకరు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. వీరిద్దరూ సీనియర్లే. రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్నవారే. వీరిలో ఆనం కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి గెలిచారు. అలాగే శిల్పా టీడీపీ నుచి వైసీపీలో చేరి విధేయత చాటుకున్నారు. వీరిద్దరూ కాకపోతే మాత్రం శ్రీకాకుళం ఎమ్మెల్యే, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ లో మంత్రి పదవి ఖాయమైన వారిలో ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది.

Recommended Video

AP New Districts: 42 ఏళ్ల తరువాత ఒకే సారి 13 జిల్లాల ఏర్పాటు | 26 Districts in AP | Oneindia Telugu
 జగన్ కు పెను సవాల్ ?

జగన్ కు పెను సవాల్ ?

కొత్త ఆర్ధికమంత్రి ఎంపిక కచ్చితంగా సీఎం జగన్ కు కూడా సవాల్ గా మారబోతోంది. ఎందుకంటే ఇక్కడ మిగతా మంత్రి పదవులకు సీనియార్టీనో, సామాజిక సమీకరణాలో, విధేయతో, గతంలో ఇచ్చిన హామీలో ప్రామాణికంగా ఉంటే ఆర్ధికమంత్రికి మాత్రం అదనంగా ఆర్ధికాంశాలపై పట్టుతో పాటు ఢిల్లీలోనూ నిధుల కోసం లాబీయింగ్ చేయగలిగిన సత్తా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత ఆర్ధికమంత్రి గత మూడేళ్లుగా ఢిల్లీలో వారాల పాటు పాగా వేసి మరీ నిధులు తెస్తున్నారు. ఇప్పుడు ఆయన వారసుడు కూడా అదే స్దాయిలో లేదా అంతకంటే మెరుగ్గా పనిచేయాలని జగన్ కోరుకోవడం సహజం. అయితే పార్టీలో ఆ స్ధాయిలో సమర్ధులు ఉన్నారా అంటే వెతుక్కోవాల్సిందే. ఇందులో ఆనంకు గతంలో ఆర్ధికమంత్రిగా పనిచేసిన ఆనుభవం ఉంది. శిల్పా చక్రపాణిరెడ్డి మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. ధర్మాన రెవెన్యూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఈ ముగ్గురిలో ఒకరికి ఆర్ధికమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు జగన్ మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా ఆర్ధికమంత్రి ఎంపిక మాత్రం జగన్ కు సవాల్ కానుంది.

English summary
suspense continue over ap's new finance minister amid jagan cabinet reshuffle on april 11th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X