వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాది సస్పెన్షన్: రోజాకు ఊరట, తీర్మానాన్ని కొట్టేసిన హైకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైకోర్టులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రోజాను స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని హైకోర్టు గురువారంనాడు కొట్టేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రోజా సస్పెన్షన్‌ను ఎత్తేయాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల తర్వాత మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

Also Read: జగన్‌కు షాక్: ఏడాది పాటు అసెంబ్లీ నుంచి రోజా సస్పెండ్, ఎందుకు?

సుప్రీంకోర్టు సూచన మేరకు బుధవారం రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. బుధవారంనాడు విచారణ పూర్తి కాగా, గురువారంనాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం లేదని, ఒక సెషన్‌కు మాత్రమే చేయాల్సి ఉంటుందని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ బుధవారంనాడు కోర్టుకు తెలిపారు.

Suspension: YSC MLA Roja gets relief in High Court

340 (2) సెక్షన్ కింద ఒక సెషన్‌కు మాత్రమే సస్పెండ్ చేసే అవకాశముందన్నారు. సస్పెండ్ చేసే సభ్యుడి పేరును మోషన్‌లో మెన్షన్ చేయాలని, కానీ అలా జరగలేదన్నారు. మోషన్ సమయంలో రోజా పేరును పేర్కొనలేదని చెప్పారు. రూల్ 55 ప్రకారం సస్పెన్షన్ మోషన్‌ను స్పీకర్ స్క్రూటినీ చేయాలన్నారు.

కానీ అక్కడ అలా కూడా జరగలేదని చెప్పారు. రోజా సస్పెన్షన్ పూర్తిగా రూల్స్‌కు విరుద్ధంగా జరిగిందన్నారు. సభ్యుడి హక్కులకు భంగం కలిగినప్పుడు విచారించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందని రోజా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రోజాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడంలోను కావాలని నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు.

Also Read: అదే సూత్రం: వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై స్పీకర్ కోడెల

ఈ సందర్భంగా రోజా తరఫు న్యాయవాది.. తమిళనాడులో రాజారాంపాల్ పైన విధించిన ఏడాది సస్పెన్షన్‌ను రీకాల్ చేసిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రోజా తరఫు న్యాయవాది వాదనల అనంతరం విచారణ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా పడింది. కాగా, విచారణ సమయంలో కోర్టు హాలులోనే రోజా ఉన్నారు.

తీర్పు విషయమై అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ప్రభుత్వ లాయర్‌కు హైకోర్టు ప్రశ్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై 194(3) నిబంధన కింద చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో బుధవారం నాడు తన వాదనలు వినిపించారు.

Also Read: రోజాకు షాక్: సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ఈ సందర్భంగా హైకోర్టు.. 340 నిబంధనను 194 విభేదిస్తుందా అని ప్రశ్నించింది. 340 నిబంధన కేవలం ఒకసెషన్‌కే వర్తిస్తుంది కదా అని హైకోర్టు అడిగింది. దీనికి రోజా తరఫు లాయర్ మాట్లాడుతూ.. 340 నిబంధన ఒక సెషన్‌కే వర్తిస్తుందన్నారు.

English summary
In a relief to YSR Congress MLA Roja, High Court ordered to withdraw suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X