తప్పు దిద్దుకోండి: ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై జగన్ పార్టీ ఎమ్మెల్యే గుస్సా, చినరాజప్పపై నెహ్రూ
హైదరాబాద్: కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము పోటీ నుంచి తప్పుకొంటున్నామంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ తప్పుడు ప్రచారం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై వెంటనే సవరణ వార్తలను ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేయాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తాము ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

చినరాజప్ప వ్యాఖ్యలు సరికాదు: నెహ్రూ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారంటూ చినరాజప్ప వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు.
ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే వైయస్ జగన్ అడ్డుకుంటున్నారని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఓటుకు కోట్ల తెలుగుదేశం పార్టీ నీచ సంస్కృతిని వైయస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications