Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేషం మార్చి స్వామీజీగా.. ఎలమంచిలిలో సంక్షేమ పథకాలపై ఆరా; ఎవరో తెలిసి అవాక్కైన ప్రజలు

ఎలమంచిలి నియోజకవర్గంలో ఒక స్వామీజీ హల్ చల్ చేశారు. నుదిటిన విభూతి, కాషాయ బట్టలు, మెడలో రుద్రాక్షమాల, చలువ కళ్ళద్దాలతో ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అని స్వామీజీ ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వ పాలన పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తమ దగ్గరకు వచ్చింది ఎమ్మెల్యే అని గుర్తించని ప్రజలు ఆయనతో తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

మారువేషంలో స్వామీజీగా ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే

మారువేషంలో స్వామీజీగా ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం లోని అచ్చుతాపురం గ్రామం, ఆవ సోమవరం, అప్పన్నపాలెం గ్రామాలతో పాటు, మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళిన స్వామీజీ, గ్రామంలోని ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు అందరికీ అందుతున్నాయా? నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి? వంటి అనేక అంశాలను ఆయన ప్రజలతో ఆరా తీశారు. స్వామీజీ వచ్చి ప్రజల యోగక్షేమాలు అడుగుతుంటే, ప్రజలు తమ ఇబ్బందులను, తమ సమస్యలను స్వామీజీ ముందు ఏకరువు పెట్టారట.

స్వామీజీకి ప్రభుత్వ పాలనతోపాటు, స్థానిక సమస్యలను చెప్పుకున్న ప్రజలు

స్వామీజీకి ప్రభుత్వ పాలనతోపాటు, స్థానిక సమస్యలను చెప్పుకున్న ప్రజలు

ప్రధానంగా రోడ్లు బాగోలేవని, రోడ్ల సమస్యలతో తాము ఇబ్బంది పడుతున్నామని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, విద్యుత్ చార్జీలు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు స్వామీజీకి చెప్పుకొని లబోదిబోమన్నారు అని సమాచారం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందుతున్నప్పటికీ విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు స్వామీజీకి చెప్పుకున్నారని తెలుస్తుంది. ప్రజల మనసులో వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం స్వామీజీగా మారువేషంలో ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రజలు చెప్పిన సమస్యలన్నింటిని శ్రద్ధగా విని ఆ తరువాత నేరుగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రజల సమస్యలపై వారిని ప్రశ్నించారు.

తహసీల్దార్ కార్యాలయానికి స్వామీజీ వేషంలోనే ఎమ్మెల్యే .. వేషం తొలగించటంతో అధికారులు షాక్

తహసీల్దార్ కార్యాలయానికి స్వామీజీ వేషంలోనే ఎమ్మెల్యే .. వేషం తొలగించటంతో అధికారులు షాక్

తహసిల్దార్ ఇన్ని సమస్యలు చెప్తున్నారు.. ఇంతకీ మీరెవరు అంటూ స్వామీజీని ప్రశ్నించగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్వామీజీ గా తన మారు వేషాన్ని తొలగించి ప్రజల సమస్యలపై మాట్లాడారట. ఇక ఎమ్మెల్యే కన్నబాబు రాజు ను చూసిన అధికారులు అవాక్కయ్యారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రజలు తనతో చెప్పుకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లుగా సమాచారం. గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వ పాలన గురించి ఆరా తీసిన స్వామి గురించి మాట్లాడుకున్న గ్రామస్తులు, తమ దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న స్వామీజీ సాక్షాత్తు తమ ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తుంది.

Recommended Video

    ఉడిపి స్వామీజీ అనుమానాస్పద మృతి
     మారువేషంలో వచ్చిన ఎమ్మెల్యే పై చర్చ .. ఎమ్మెల్యే కన్నబాబు రాజు చెప్పిందిదే గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం వేషం మార్చి ప్రజల్లోకి వెళ్లిన కన్నబాబు రాజు పై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాజుల పాలనలో ఇదేవిధంగా మారువేషంలో పాలన ఏ విధంగా ఉందో కనుక్కోవడానికి వెళ్లేవారట.. ఇప్పుడు మళ్లీ కన్నబాబురాజు ఆ రోజుల్ని గుర్తు చేశారు అంటూ చర్చిస్తున్నారు. ఇక ప్రజల్లోకి మారువేషంలో వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రజలు వైసీపీ పాలనలో చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. వైసిపి ప్రభుత్వ పాలనకు ప్రజలు మార్కులు వేశారని కన్నబాబు రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే కన్నబాబు రాజు చెప్తున్నారు.

    xగతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం వేషం మార్చి ప్రజల్లోకి వెళ్లిన కన్నబాబు రాజు పై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో రాజుల పాలనలో ఇదేవిధంగా మారువేషంలో పాలన ఏ విధంగా ఉందో కనుక్కోవడానికి వెళ్లేవారట.. ఇప్పుడు మళ్లీ కన్నబాబురాజు ఆ రోజుల్ని గుర్తు చేశారు అంటూ చర్చిస్తున్నారు. ఇక ప్రజల్లోకి మారువేషంలో వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రజలు వైసీపీ పాలనలో చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. వైసిపి ప్రభుత్వ పాలనకు ప్రజలు మార్కులు వేశారని కన్నబాబు రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే కన్నబాబు రాజు చెప్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+