విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం ఘటనపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో మాజీ ఎంపీ రాయపాటి సాంశివరావు కోడలిని ప్రశ్నించిన పోలీసులు.. తాజాగా హీరో రామ్ పోతినేనికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఆయన కింద పనిచేస్తున్నవాళ్లు కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోపై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు స్పందించారు. అయితే, నిమిషాల వ్యవధిలోనే హీరో సైతం అంతే ఘాటుగా రియాక్ట్ కావడం గమనార్హం.

1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

నగరానికి చెందిన రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం... స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కొవిడ్ సెంటర్ నిర్వహిస్తుండటం, గతవారం అక్కడ అగ్నిప్రమాదం సంభవించి 10 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. ఈ వ్యవహారంలో రమేశ్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం, సిబ్బందిపై పలు కేసులు నమోదయ్యాయి. అజ్ఞాతంలోకి జారుకున్న ఆస్పత్రి చీఫ్ రమేశ్ చౌదరి.. కేసు దర్యాప్తు జరుగుతోన్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేయగా, ఆయనకు బంధువైన హీరో రామ్ పోతినేని.. మొత్తం వ్యవహారంలో కుట్ర జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. తొలుత రామ్ వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్న పోలీసులు.. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

ఏపీసీ సూర్యచంద్రరావు వార్నింగ్..

ఏపీసీ సూర్యచంద్రరావు వార్నింగ్..

‘‘రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో ఇప్పటివరకు డాక్టర్ మమత(మాజీ ఎంపీ రాయపాటి కోడలు), సౌజన్యలను ప్రశ్నించాం. ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రమేశ్ బాబు అల్లుడు కల్యాణ్ చక్రవర్తి విచారణకు రావాల్సిఉండగా, ఆరోగ్య కారణాలతో టైమ్ కోరారు. అయితే, కల్యాణ్ కు కరోనా నిజమా, కాదా, అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. అగ్ని ప్రమాదం కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోము. విచారణకు అడ్డొస్తే, అవసరమైతే హీరో రామ్ పోతినేనికి కూడా నోటీసులు ఇస్తాం'' అని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..

రమేశ్ బాబు కోసం వేట..

రమేశ్ బాబు కోసం వేట..

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రమేశ్ బాబు కోసం గాలింపు ముమ్మరం చేశామని ఏసీపీ సూర్యచంద్రరావు చెప్పారు. రమేశ్ చౌదరి ఆడియో టేపుల్లో మాట్లాడటం కాదని, 91 సీఆర్‌పీసీ కింద ఆయన తన దగ్గరున్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని, ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పత్రాలను చూపించాలన్నారు. రెండ్రోజుల కిందట ఓ ఆడియోను విడుదల చేసిన రమేశ్ చౌదరి.. అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తుపై అనుమానాలున్నాయని, అందుకే న్యాయ నిపుణుల సలహాతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని పేర్కోవడం తెలిసిందే.

హీరో రామ్ తాజా ప్రకటన..

హీరో రామ్ తాజా ప్రకటన..

దర్యాప్తునకు అడ్డొస్తే రామ్ పోతినేని పని పడతామంటూ విజయవాడ ఏసీపీ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే హీరో మరో సంచలన ప్రకటన చేశారు. స్వర్ణప్యాలెస్, రమేశ్ ఆస్పత్రి వ్యవహారంలో అసలైన కుట్రదారులకు కచ్చితంగా శిక్షలు పడతాయని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని హీరో చెప్పారు. అంతేకాదు, ఈ వివాదానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రకటనలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. రమేశ్ చౌదరికి అనుకూలంగా, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ రామ్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే హీరో తాజా ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Vijayawada ACP Suryachandra Rao said they would not hesitate to issue notices to ram pothineni if he interrupt the investigation of the Swarna Palace incident. minuits after acp warning, hero tweets that he won’t be tweeting about this anymore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X