'ఏపీ, తెలంగాణకి దేవుడి ఆశీస్సులు ఉండవు'

కాకినాడ: శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన కాకినాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించడం లేదని అన్నారు.

హైందవ మతాలకు మంచి జరుగుతుందని ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని చెప్పారు.

Swaroopanand saraswati controversy comments on Ap and Telangana

గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారకంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వ్వవహరిస్తున్నాయని అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఏపీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+