జాగ్రత్తగా చూస్తాం: శ్వేతాబసు తల్లి, వెళ్లేందుకు సిద్ధం!
హైదరాబాద్: తన కూతురును అప్పగించాలని టాలీవుడ్ నటి శ్వేతాబసు తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక నుంచి తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకుంటామని, ఆమెను వెన్నంటి ఉంటానని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో జడ్జి శ్వేతబసును కూడా విచారించారు.
అమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. రెస్క్యూ హోం నుండి శ్వేతాబసును పంపించాలంటే నిర్వాహకులు ఆమె కుటుంబ పరిస్థితి పైన న్యాయస్థానానికి నివేదిక సమర్పించవలసి ఉంటుంది. అనంతరం బాధితురాలు, పోలీసుల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

కాగా, వ్యభిచారం కేసులో శ్వేతాబసు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆమెను మూడు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు. తల్లి తమ బిడ్డను అప్పగించాలని కోరడంతో శ్వేతాబసు రికార్డును కూడా న్యాయస్థానం రికార్డు చేసింది.
కాగా, టీవీ నటి, తెరపై శ్వేతబసుకు తల్లిగా నటించిన సాక్షి తన్వార్.. వ్యభిచారం కేసులో శ్వేతబసు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే తన భావాలను మీడియాతో పంచుకున్నారు. రెస్క్యూ హోంలో ఉంటున్న శ్వేతబసును కలిసేందుకు ఆమె కన్నతల్లిని అనుమతించడం లేదని సాక్షి తన్వార్ అన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications