2023లో కండోమ్‌లనే ఎక్కువ ఆర్డర్ చేశారట..ఆటగాళ్లే
నేటి యువత ఆన్‌లైన్‌కు ఎక్కువుగా అలవాటు పడిపోతున్నారనే చెప్పాలి. ఈ కామర్స్ అడుగుపెట్టిన తరువాత బయటకు వెళ్లి షాపింగ్ చేయడమే మానేశారు. వేసుకునే దస్తులు దగ్గర నుంచి తినే తిండి వరకూ అన్ని కూడా ఆన్‌లైన్‌లో దొరకుతున్నాయి. 10 రూపాయిల వస్తువు దగ్గర నుంచి లక్షల్లో విలువ చేసే వస్తువు వరకూ ప్రతిది కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతుండటంతో అందరూ దీనిపై వైపే మొగ్గు చూపిస్తున్నారు.
మధ్యతరగతి గృహిణీలు సైతం ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడటం విశేషం. పైగా ఆర్డర్ చేసిన వస్తువు నచ్చకపోతే రిటర్న్ చేసే అవకాశం కూడా ఉండటంతో ఆన్‌లైన్ షాపింగ్‌కే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన స్విగ్గీ తమ ఆన్‌లైన్ షాపింగ్ వివరాలను బయటపెట్టింది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ - 2023 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కండోమ్స్ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ సంస్థ తెలిపింది. కండోమ్స్ తరువాత ఉల్లిపాయి,అరటి పండు , చిప్స్ ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ సంస్థ తమ నేవేదికలో పేర్కొంది.
చైన్నైకి చెందిన ఓ వ్యక్తి 31,748 రూపాయిలు విలువ చేసే వస్తువులను ఆర్డర్ చేయడమే అతి పెద్ద ఆర్డర్‌గా నమోదైందని స్విగ్గీ తెలిపింది. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఈ ఏడాదిలో ఇన్‌స్టామార్ట్‌లో రూ 12,87,920 ఆర్డర్లు చేసి మొదటి స్థానంలో నిలిచాడని స్విగ్గీ సంస్థ తమ నివేదికలో చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications