దొంగల ముఠా అరెస్ట్: బైకులు, గోల్డ్ సీజ్(పిక్చర్స్)

హైదరాబాద్: దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న మిర్జా అజ్మత్ అలీ బేగ్ అలియాస్ అలీ (22), మహ్మద్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 17 లక్షల విలువైన 57 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5 లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

పశ్చిమ మండల డిసిపి వి సత్యనారాయణ కథనం ప్రకారం.. నగరంలోని నవాబాసాబ్‌కుంట ప్రాంతానికి చెందిన అలీ అదే ప్రాంతంలో ఉండే సయ్యద్ హుస్సేన్ అలియాస్ లంబా (26) వద్ద పనిచేస్తుంటాడు. లంబా 2010లో నగరంలో నమోదైన 109 కేసుల్లో, 2012లో నమోదైన 44 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు తన సహాయకులతో నగరంలోని ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, సైఫాబాద్, సనత్‌నగర్, కుషాయిగూడ ప్రాంతాల్లో దొంగతనాలు చేయిస్తుంటాడు.

అలీ, మరో వ్యక్తి మహ్మద్‌తో కలిసి లంబా చెప్పినట్టుగా చోరీలకు పాల్పడుతుండేవారు. వీరికి మహ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి నకిలీ ధృవ పత్రాలతో సిమ్ కార్డులు అందించేవాడు. చోరీల కోసం లంబా కరిజ్మా బైకులను కొనుగోలు చేసి, చోరీ అనంతరం ఎవరికీ దొరక్కుండా వాటిని సగం ధరకే అమ్మేస్తుంటాడు. అలీ, లంబాలు కలిసి బైకులపై సంచరిస్తూ, ఎదురించిన వారిపై కత్తులతో దాడి చేస్తూ పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో ఓసారి చోరీని అడ్డుకోబోయిన పంజాగుట్ట కానిస్టేబుళ్లపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు.
ఇలా వీరిపై ఎస్సార్‌నగర్, పంజాగుట్ట, సైఫాబాద్, కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో పెద్ద మొత్తంలో కేసులున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఎస్సార్ నగర్ పోలీసులు అలీని, ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఇద్దరు ప్రధాన దొంగలు లంబా, మహ్మద్ పరారీలో ఉన్నారు.

సీజ్ చేసిన బైకులు

సీజ్ చేసిన బైకులు

దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాని నిందితుడి ఫొటో చూపిస్తూ..

ప్రధాని నిందితుడి ఫొటో చూపిస్తూ..

హైదరాబాద్‌లోని నవాబాసాబ్‌కుంట ప్రాంతానికి చెందిన అలీ అదే ప్రాంతంలో ఉండే సయ్యద్ హుస్సేన్ అలియాస్ లంబా (26) వద్ద పనిచేస్తుంటాడు. లంబా 2010లో నగరంలో నమోదైన 109 కేసుల్లో, 2012లో నమోదైన 44 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

వివరాలు వెల్లడిస్తూ..

వివరాలు వెల్లడిస్తూ..

పశ్చిమ మండల డిసిపి వి సత్యనారాయణ కథనం ప్రకారం.. సయ్యద్ హుస్సేన్ అలియాస్ లంబా 2010లో నగరంలో నమోదైన 109 కేసుల్లో, 2012లో నమోదైన 44 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు తన సహాయకులతో నగరంలోని ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, సైఫాబాద్, సనత్‌నగర్, కుషాయిగూడ ప్రాంతాల్లో దొంగతనాలు చేయిస్తుంటాడు.

సీజ్ చేసిన గోల్డ్ చైన్స్

సీజ్ చేసిన గోల్డ్ చైన్స్

దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న మిర్జా అజ్మత్ అలీ బేగ్ అలియాస్ అలీ (22), మహ్మద్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 17 లక్షల విలువైన 57 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+