బిజెపి కలిసినా సంఖ్యాబలం లేదా, సుష్మ సపోర్ట్: జైపాల్

ప్రత్యక్ష ప్రసారం చూపించనంత మాత్రాన అప్రజాస్వామికమవుతుందా అని ప్రశ్నించారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం లభించలేదన్నారు. మూజువాణి ఓటు ఎట్టి పరిస్థితుల్లో కాదని ఓటింగ్ మాత్రమే జరిగిందన్నారు. బిజెపి ఎన్ని రకాలుగా మాట్లాడిన సుష్మా స్వరాజ్ మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. బిల్లును రాజ్యసభలో త్వరలో ప్రవేశ పెడతారని చెప్పారు.
ఈ బిల్లు ద్వారా సీమాంధ్రకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. ఈ బిల్లు గెలవడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే కారణమన్నారు. సోనియా ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయరన్నారు. తొమ్మిది రోజులుగా పార్లమెంటు ఉభయ సభలు స్తంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి భవన్‌కు సీమాంధ్రకు ఇచ్చారని తాము దానిని పట్టించుకోవడం లేదన్నారు.
సమ భావం, సమన్యాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, వారి భావమేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. మజ్లిస్ పార్టీ వారు పెద్ద వీరాభిమానుల్లా అనేక సవరణలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు ఆపివేశారో తెలియదన్నారు. హింసాత్మక సంఘటనలు జరుగుతాయని భావించి నిలిపివేయవచ్చునని అన్నారు. మెజార్టీ ప్రకారం వెళ్లడం స్పీకర్ బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications