చంద్రబాబు, జగన్ ఒకే లైన్

Chandrababu Naidu: టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు అందుకున్న రెండో జట్టు ఇదే. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే.

శనివారం రాత్రి బార్బడొస్‌లో జరిగిన ఫైనల్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగలు వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.

T20 World Cup 2024 final Chandrababu Naidu YS Jagan greets Team India

ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తరువాత విజృంభించాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ న్యాయం చేశాడు. 31 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47 పరుగులతో రాణించాడు.

చివర్లో శివం దూబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 16 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 27 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 170ని దాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లల్లో కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్ట్జే రెండు చొప్పు. మార్కో జెన్‌సెన్, కగిసొ రబడ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.

178 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా కూడా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కుకున్నారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 70 పరుగులు జోడించారు. వారిద్దరూ అవుట్ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టనిపించింది గానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డు నిలిచాడు.

27 బంతుల్లోనే అయిదు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు. అతను ఉన్నంత సేపూ మ్యాచ్‌పై ఆశల్లేవు. 151 పరుగుల వద్ద క్లాసెన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉండటం కలవరపాటుకు గురి చేసినా చివరి ఓవర్ తొలిబంతికి అతనూ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది.

T20 World Cup 2024 final Chandrababu Naidu YS Jagan greets Team India

17 సంవత్సరాల తరువాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ విషెస్ తెలిపారు. చారిత్రాత్మక విజయం అందుకున్నారని ప్రశంసించారు.

కేప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సపోర్టింగ్ స్టాఫ్ మొత్తానికీ వారు అభినందనలు తెలిపారు. దేశాన్ని తలెత్తుకునేలా చేశారంటూ ప్రశంసించారు. కోట్లాదిమంది దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకున్నారు.

టోర్నీ మొత్తం సమష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందని వైఎస్ జగన్ అన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటినిస్తుందని చెప్పారు. రోహిత్‌ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+