ఇద్దరు సిఎంలని పిల్చిన తలసాని: బాబు బ్రాండ్ వార్నింగ్

Talasani invites KCR and Chandrababu
హైదరాబాద్: వచ్చే ఆదివారం జరిగే సికంద్రాబాద్ మహంకాళీ బోనాల పండుగకు హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్... తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను ఆహ్వానించారు.

ఏటా చంద్రబాబు నాయుడు బోనాల పండుగు రావడ ఆనవాయితీ అన్నారు. ఈ ఏడాది కూడా ఆయన పాల్గొంటారని తలసాని చెప్పారు. ఆదివారం ఇద్దరు ముఖ్యమంత్రులు బోనాల పండుగకు హాజరయ్యే అవకాశముందని చెప్పారు.

హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీస్తే: చంద్రబాబు

హైదరాబాదు శాంతిభద్రతల బాధ్యతలు గవర్నర్‌కు అప్పగించే అంశం చట్టంలోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యల పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో సీపీఐ భేటీ

ఆంధ్రప్రదేశ్ సీపీఐ నేతలు చంద్రబాబు భేటీ అయ్యారు. రుణమాఫీ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వారు కోరారు. కౌలు రైతులకు కూడా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+