గొంతు నొక్కొద్దు: కేసీఆర్‌కి తలసాని, సిగ్గుసిగ్గు అంటూ..
హైదరాబాద్: ఎంఎస్ఓలకు, ప్రభుత్వానికీ కొన్ని పరిధులు ఉన్నాయని, మీడియాను మన అధీనంలోకి తీసుకుని, అందరినీ భయపెట్టే విధంగా చేయడం సరైన విధానం కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ సోమవారం అన్నారు. మీడియా గొంతు నొక్కాలనుకోవద్దన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జర్నలిస్టులు చేపట్టిన శాంతి ర్యాలీకు మద్దతు ఇచ్చిన తలసాని మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని కేబుల్ నెట్‌వర్క్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎస్ఓలు, మీడియా వాళ్లను పిలిపించి సమస్యను పరిష్కరించాలన్నారు.

ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ రాజధాని హైదరాబాదులో భారీ ర్యాలీ తీస్తున్న దృశ్యం.

సిగ్గుసిగ్గు
'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా పైన ఆంక్షలా సిగ్గుసిగ్గు', 'మీడియా స్వేచ్ఛను హరించవద్దు' అంటూ ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ రాజధాని హైదరాబాదులో భారీ ర్యాలీ తీస్తున్న దృశ్యం. టీవీ9 ప్రసారాలను పునఃప్రారంభించాలని ప్లకార్డు.

ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ రాజధాని హైదరాబాదులో భారీ ర్యాలీ తీస్తున్న దృశ్యం. టీవీ9 ప్రసారాలను పునఃప్రారంభించాలని ప్లకార్డు.












Click it and Unblock the Notifications