తీరని లోటు: ఎంఎస్ మృతిపై తలసాని, నవ్వుల రేడు లేడన్న వెంకయ్య
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ మృతి తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఫిల్మ్‌చాంబర్‌లో ఎమ్మెస్ నారాయణ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెఎస్ మృతి చాలా బాధాకరమన్నారు. తెలుగు చిత్రపరిశ్రమే కాకుండా తెలుగు వారు అందరూ మంచి నటుడిని కోల్పోయారన్నారు. తెలుగు సినీ ఇండస్ర్టీలో ప్రముఖ నటులు మృతి చెందడం పట్ల మంత్రి తలసాని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఎంఎస్ నారాయణ మృతి పట్ల తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఏపి సిఎం చంద్రబాబునాయుడు, మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, అయన్నపాత్రుడు, సినీనటులు సంతాపం ప్రకటించారు.

విశాఖపట్నం: ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ మృతి సినీరంగానికి తీరని లోటని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపి మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంపి హరిబాబు అన్నారు. శుక్రవారం ఈ విషయమై వారు మీడియాతో మాట్లాడుతూ.. నవుల రేడు ఇకలేరని, ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఎమ్మెస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఎమ్మెస్ కటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications