జోలికొస్తే గుట్టు విప్పుతా!: బాబుకు తలసాని హెచ్చరిక
హైదరాబాద్: హైదరాబాద్ నగర సీనియర్ టీడీపీ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. చంద్రబాబు తన జోలికి వస్తే టీవీ సీరియల్‌లా రోజుకో కథ విప్పుతానని చెప్పారు. 100 రూపాయలు తీయని నేతలు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల కోసం రూ.50 లక్షలు ఇస్తారా అని ఎద్దేవా చేశారు. టీడీపీలో అవమానం జరిగిందని, అందుకే తెరాసలో చేరుతున్నానని తలసాని అన్నారు.
కాగా, నగరానికే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్న విషయం తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు మరికొద్ది రోజుల తర్వాత చేరే అవకాశముందని తెలుస్తోంది. ఈ రోజు టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో తీగల కారు ఎక్కనున్నారు.

కేసీఆర్ అవమానిస్తున్నారు: షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అగౌరవపరుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న వేలాది మందిపై కేసులుంటే చిన్న చిన్న కేసులను కొన్నింటిని మాత్రమే ఎత్తేస్తున్నారన్నారు.
మిగిలిన కేసుల సంగతి ఏమిటని మండిపడ్డారు. ఉద్యమకారులను గౌరవించాలన్న విషయం కూడా కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క కుటుంబాన్నైనా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ పరామర్శించారా? అని నిలదీశారు.
ఏనుమాముల మార్కెట్ యార్డులో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ యార్డులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం ఉదయం ధర్నా నిర్వహించారు. టి.పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, బస్వరాజు సారయ్య, గండ్ర, రాజయ్య, పలువురు నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications