వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పటడుగు వేశా... సరిదిద్దుకొంటా: అనుచరులతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి మంతనాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తప్పటడుగు వేశాను... ఆ తప్పును సరిదిద్దుకొంటానని తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. 2012లో చంద్రబాబునాయుడు పాదయాత్ర సమయంలో ప్రవీణ్‌కుమార్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గానికి కొంత కాలంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి దూరం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి పట్టుంది. ప్రవీణ్‌కుమార్ రెడ్డి తండ్రిని ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మ విజయం సాధించారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గంలో రెండు దఫాలు పోటీ చేసి ఒక్కసారే విజయం సాధించారు.

తప్పును సరిదిద్దుకొంటా

తప్పును సరిదిద్దుకొంటా

తప్పటడగు వేశానని.. తప్పు సరిదిద్దుకొంటానని వైసీపీ నేత, తంబళ్ళపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.2009 ఎన్నికల్లో ప్రవీణ్‌కుమారెడ్డి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల్లో ప్రవీణ్‌కుమార్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 2012లోనే ప్రవీణ్‌కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. చంద్రబాబునాయుడు పాదయాత్రకు ముందే ప్రవీణ్‌కుమార్ రెడ్డి పార్టీని వీడారు.2014 ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.

 అనుచరులతో ప్రవీణ్ సమావేశం

అనుచరులతో ప్రవీణ్ సమావేశం

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో అనుచరులతో ప్రవీణ్‌కుమార్ రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తంబళ్లపల్లెలో అనుచరులతో భేటీ అయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తన వంతు పరిష్కార దిశగా కృషి చేస్తానన్నారు. అనుచరులను పేరుపేరునా పలకరించి ఆదరించాలంటూ అభ్యర్థించారు.అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందున ఇప్పటినుండే ప్రవీణ్‌కుమార్ రెడ్డి రంగంలోకి దిగారని విశ్లేషకులు భావిస్తున్నారు.

 ప్రవీణ్‌కుమార్ రెడ్డి కటుంబానికి పట్టు

ప్రవీణ్‌కుమార్ రెడ్డి కటుంబానికి పట్టు

తంబళ్ళపల్లే నియోజకవర్గంలో ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి పట్టుంది. 1985లో ఈ నియోజకవర్గం నుండి ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మ విజయం సాధించారు. అయితే 1989లో జరిగిన ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మ స్వతంత్ర్య అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.1994లో లక్ష్మీదేవమ్మ ఈ స్థానం నుండి మరోసారి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు.1999 ఎన్నికల్లో ఈ స్థానాన్ని మిత్రపక్షాల పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించింది టిడిపి. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి నర్సింహరెడ్డి పోటీచేసి ఓటమి పాలయ్యారు.2004 ఎన్నికల్లో కూడ ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యూహమేమిటీ

ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యూహమేమిటీ

2012లో ప్రవీణ్‌కుమార్ రెడ్డగి టిడిపిని వీడారు. ఆ తర్వాత కొంతకాలానికే అమర్‌నాథ్‌రెడ్డి కూడ ఆ సమయంలో టిడిపిని వీడారు. అమర్‌నాథ్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పలమనేరు నుండి విజయం సాధించారు. అయితే ఇటీవల కాలంలో అమర్‌నాథ్ రెడ్డి టిడిపిలో చేరారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లాలో పట్టున్న నేతలను టిడిపిలో చేర్పించే పనిలో అమర్‌నాథ్ రెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో ప్రవీణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయం తీసుకోవాలని ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే వచ్చే ఎన్నికల కోసం ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఇప్పటి నుండే ప్లాన్ చేసుకొంటున్నారు.

English summary
Tamballapalli former MLA Praveen kumar reddy meeting with followers on Wednesday.before 2014 elections Praveen kumar reddy joined in Ysrcp from Tdp.Praveen kumar defeated in 2014 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X