'జయలలితకు అనుకూలం, రోశయ్యను అర్జంటుగా తప్పించాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను అత్యవసరంగా గవర్నర్ పదవి నుంచి తొలగించాలని పీఎంకే డిమాండ్ చేస్తోంది. రోశయ్య అన్నాడిఎంకే ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని పిఎంకే చీఫ్ ఎస్ రాందాస్ ఆరోపించారు.
తమిళనాడులో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన రెండు నియోజకవర్గాల్లో జూన్ ఒకటికల్లా ఎన్నికలు త్వరగా నిర్వహించాలంటూ రోశయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాశారని రాందాస్ ఆరోపించారు. అన్నాడిఎంకే ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న రోశయ్య గవర్నర్ పదవికి తగరన్నారు.

ఆయనను తక్షణమే గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాందాస్ డిమాండ్ చేశారు. పీఎంకే అధినేత గవర్నర్‌తో పాటు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కూడా పీఎంకే అధినేత తప్పుబట్టారు. కాగా, ఎన్నికలు జరగని రెండు నియోజకవర్గాల్లో జూన్ 1లోగా నిర్వహించాలని రోశయ్య ఈసీకి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications