రద్దు సరికాదు: తమిళనాడులో తెలుగు కోసం ధర్నా(పిక్చర్స్)
హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదువుల నిలిపివేతపై ఇచ్చిన జీఓను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.
గురువారం ఇందిరాపార్కు వద్ద తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ నిరసనలో పాల్గొన్నా నారాయణ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు ప్రజలు వందల ఏళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారని అన్నారు.
ఇప్పటికీ తమిళనాడులో 40 శాతం తెలుగువారే ఉన్నారని చెప్పారు. బంధుత్వాలు, వ్యాపారాలు, రాజకీయాలతో అంతా మమేకమైపోయారన్నారు. భాషాపరంగా రెచ్చగొట్టేలా కాకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు

తెలుగు కోసం ధర్నా
తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదువుల నిలిపివేతపై ఇచ్చిన జీఓను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.

తెలుగు కోసం ధర్నా
గురువారం ఇందిరాపార్కు వద్ద తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్, తమిళనాడు తెలుగు సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి.

తెలుగు కోసం ధర్నా
ఈ నిరసనలో పాల్గొన్నా నారాయణ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు ప్రజలు వందల ఏళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారని అన్నారు.

తెలుగు కోసం ధర్నా
ఇప్పటికీ తమిళనాడులో 40 శాతం తెలుగువారే ఉన్నారని చెప్పారు. బంధుత్వాలు, వ్యాపారాలు, రాజకీయాలతో అంతా మమేకమైపోయారన్నారు. అనేక తెలుగు చిత్రాల్లో నటించిన జయలలిత తెలుగుప్రజల అభిమాన నటిగా పేరొందారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ.. దీనిపై శాసనసభ, శాసనమండలిలో తీర్మానాలు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వపరంగా తమిళనాడు సీఎం జయలలిత, గవర్నర్ రోశయ్యలను కలిసి చర్చించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వజమాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగులో చదువుకునేందుకు వీల్లేకుండా చేయడమంటే ప్రాథమిక హక్కులను హరించినట్లేనన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమంతా ఏకమై వారం రోజుల్లో జయలలితను కలిసి చర్చిస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో తెలుగు పాఠశాలలను బతికించుకునేందుకు తెలుగువారంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications