• search
 • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'సంపూర్ణేష్ బాబు వస్తుంటే మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాకపోవడం ఏమిటి'

|

కడప: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనేది రాయలసీమ ప్రాంతానికి మాత్రమే కాకుండా, ఆంధ్రుల హక్కు అని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. కడప ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 158 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కడపలో ఆమరణ దీక్షలను నిర్వహించింది.

  పవన్ టార్గెట్ రివర్స్ అయిందా ?

  ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అన్నది ఈ ప్రాంతం వారికి సంజీవని అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఏపీ మొత్తం ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  మహేష్ బాబు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ స్పందించలేదు

  మహేష్ బాబు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ స్పందించలేదు

  విభజన హక్కుల సాధనా సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. సినీ నటులు బాలకృష్ణ, మహేష్ బాబు, చిరంజీవిలు ఉక్కు పరిశ్రమపై మాట్లాడాలని కోరామని చెప్పారు. మరో నాయకులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కోరామని, జగన్‌ను కూడా సంప్రదించామని చెప్పారు. వారు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

  మోడీని చూస్తే భయం

  మోడీని చూస్తే భయం

  ప్రధాని మోడీని చూస్తేనే సీఎం చంద్రబాబు, జగన్‌లకు వెన్నులో వణుకు పుడుతోందని చలసాని శ్రీనివాస్‌ విమర్శించారు. జిల్లాలో నెలకొల్పిన షుగర్‌ ఫ్యాక్టరీ, పేపర్‌ మిల్లు, ఆల్విన్ కర్మాగారం మూతపడ్డాయన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని విభజన హామీని చట్టంలో పొందుపరచి నాలుగు సంవత్సరాలవుతున్నా ఇంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయన్నారు.

   నటులు స్పందించక పోవడం దారుణం

  నటులు స్పందించక పోవడం దారుణం

  దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సీనీ హీరోలు శివాజీ, సంపూర్ణేష్‌లు విభజన హామీలపై స్పందిస్తుంటే సినీ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణ మహేష్‌ బాబులు మాటయినా మాట్లాడకపోవడం దారుణమన్నారు. బ్రిటీష్‌ పాలకులపై ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులులాంటి మహనీయులు జన్మించిన ఆంధ్రలో ఉద్యమాలకు భయపడేవారెవరూ లేరన్నారు.

  సహకారం అందిస్తానని తమ్మారెడ్డి

  సహకారం అందిస్తానని తమ్మారెడ్డి

  ఉద్యమాలతోనే ఆశయాలు, డిమాండ్లు సాధించుకోవచ్చని ఈ సందర్భంగా వక్తలు అన్నారు. తమ కోసం కాకుండా భావితరాల వారి బంగారు బతుకు కోసం ఆమరణ దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. ఇటువంటి పరిస్థితికి కారణమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. ఉక్కు పరిశ్రమతో ఉపాధితో పాటు ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఇందుకు విశాఖపట్టణం ఓ నిదర్శనమన్నారు. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి మహోన్నతులు పాల్గొన్న అసెంబ్లీ ప్రస్తుతం వ్యక్తిగత ఆరోపణల కేంద్రంగా మారిందని మండిపడ్డారు. చలసాని శ్రీనివాస్ లాంటి వారు ఆస్తులు, ఆరోగ్యం పోగొట్టుకుంటూ విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం జరిగే పోరాటాలకు తనవంతు సహకారం అందిస్తామన్నారు.

  ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టా: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినా పవన్‌పై వైసీపీ మౌనం వెనుక?

  English summary
  Cine producer Tammareddy Bharadwaj gives Kadapa Ukku Seema Hakku slogan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more