జగనన్న స్ఫూర్తితో... హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్తగా మంత్రులుగా జగన్ సర్కార్లో కొలువుతీరిన వారు ఒక్కొక్కరుగా బాధ్యతలను చేపడుతున్నారు. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రిగా తానేటి వనిత సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన తానేటి వనిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని వెల్లడించారు.

ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తాం: మంత్రి తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్న మంత్రి తానేటి వనిత ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని వెల్లడించారు. న్యాయం-చట్టం విషయంలో ఎటువంటి వివక్ష లేకుండా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖలో గత మూడు సంవత్సరాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని, జాతీయ స్థాయిలో ఏపీ పోలీసు వ్యవస్థకు గుర్తింపు వచ్చిందని మంత్రి తానేటి వనిత వెల్లడించారు.

దిశా చట్టం పెండింగ్లో ఉన్నప్పటికీ అందులోని అనేక అంశాలను అమలు చేస్తున్నాం
ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా వచ్చాయని మంత్రి తానేటి వనిత గుర్తుచేశారు. ఇక దిశా చట్టం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని పేర్కొన్న ఆమె, దిశా చట్టం పెండింగ్లో ఉన్నప్పటికీ అందులోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని వెల్లడించారు. దిశ యాప్ ద్వారా తొమ్మిది వందల మందికి పైగా ఆడపిల్లలను ఇప్పటివరకు కాపాడామని మంత్రి తానేటి వనిత తెలిపారు. టెక్నాలజీ వినియోగంలోనూ ఏపీ పోలీసు విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి తానేటి వనిత కొనియాడారు.

రాజీ పడకుండా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాం
రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పని చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తామని ఆమె వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ రాజీపడకుండా పని చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, జగనన్న స్ఫూర్తితో తాను శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు కృషి చేస్తానని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

మహిళల భధ్రతకు ఏపీలో పెద్దపీట వేస్తున్నాం
మహిళల పట్ల సీఎం వైఎస్ జగన్ కు మంచివిజన్ ఉందని,మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.రాష్ట్రంలో దిశ యాప్ తో పాటు,మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారనిమంత్రి తానేటి వనిత వెల్లడించారు.గతంలో తానుమహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగాపని చేశానని గుర్తు చేసుకున్న వనితమహిళల భద్రత కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ వెల్లడించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications