కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ద్రరాత్రి తారకరత్న బెంగుళూరు తరలింపు - సీఎంకు చంద్రబాబు ఫోన్..!!

అర్ద్రరాత్రి రెండు ప్రత్యేక అంబులెన్సులలో తారక రత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యబృందం పర్యవేక్షణలో తీసుకెళ్లారు.

|
Google Oneindia TeluguNews

తీవ్ర గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అర్ద్రరాత్రి రెండు ప్రత్యేక అంబులెన్సులలో తారక రత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యబృందం పర్యవేక్షణలో తీసుకెళ్లారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం వేళ కుప్పం కు వచ్చిన తారకరత్న సడన్ గా అస్వస్థతకు గురయ్యారు.

స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించగా తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైనట్లు నిర్దారించారు. యాంజియోగ్రామ్ చేసారు. బెంగుళూరు నుంచి మెడికల్ టీంలు ప్రత్యేక ఏర్పాట్లతో అర్ద్రరాత్రి కుప్పం నుంచి తరలించారు. బెంగుళూరుకు తరలించే సమయం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో కోరారు.

తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రికి

లోకేష్ పాదయాత్ర ప్రారంభం వేళ కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ తో పాటుగా తారక రత్న పాల్గొన్నారు. అదే సమయంలో ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలారు. వెంటనే పార్టీ వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. బాలకృష్ణ పార్టీ నేతలతో కలిసి ఆస్పత్రి వద్దే ఉన్నారు. వైద్యులు పూర్తిస్థాయి చికిత్స అందించారు. తారకరత్న గుండెలో బ్లాక్స్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. యాంజియోగ్రామ్ చేసారు.

స్టంట్లు వేయాలని నిర్ణయించారు. ఉన్నాయి. స్టంట్‌ వేయాలంటే షుగర్‌ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్‌ టాబ్లెట్స్‌ వేసుకోకపోవడంతో షుగర్‌ లెవల్‌ 400కు చేరింది. ఈ కారణంగా వైద్యులు స్టంట్స్‌ వేయలేకపోయారు.

చంద్రబాబు - జా ఎన్టీఆర్ ఆరా

చంద్రబాబు - జా ఎన్టీఆర్ ఆరా

తారకరత్నను ఆస్పత్రిలో చేరిన సమయం నుంచి బాలకృష్ణ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ అక్కేడ ఉన్నారు. వైద్యులతో సంప్రదింపులు చేస్తూ.. వారి సూచనలు పాటించారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు ఫోన్ చేసారు. పలుమార్లు ఫోన్ ద్వారా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసారు.

బాలయ్య అటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులతోనూ సంప్రదింపులు చేసారు. తారకరత్న గుండె ఎడమ వైపు నాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు బాలయ్య వెల్లడించారు. వైద్యులు శక్తి మేర చికిత్స అందించారని చెప్పుకొచ్చారు. బెంగళూరు తరలించామని.. ఆందోళన అసవరం లేదని చెప్పారు. ఆ తరువాత బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు కుప్పం నుంచి తారకరత్నను పరిశీలించారు. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి..కుమార్తెలు ఆస్పత్రికి వచ్చారు. పూర్తి స్థాయి వైద్య ఏర్పాట్లతో అర్ద్రరాత్రి బెంగళూరుకు తరలించారు.

ఆందోళన అవసరం లేదు - బాలయ్య

ఆందోళన అవసరం లేదు - బాలయ్య

తారకతర్నను ఆస్పత్రిలో చేర్చిన సమయం నుంచి బాలయ్య అక్కేడ ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో పాటుగా ధైర్యం చెబుతూ కనిపించారు. చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ఇక, అర్ద్రరాత్రి బెంగుళూరు తరలించే సమయంలో తారకరత్న చికిత్స విషయమై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు.

ఆయన్ను తరలించే సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా వేగంగా ఆస్పత్రికి చేర్చడానికి సాయం చేయాలని కోరారు. పోలీసు అధికారులకు చెప్పి ఇబ్బంది లేకుండా చూస్తానని బొమ్మై హామీ ఇచ్చినట్లు సమాచారం. తారకరత్న కోలుకుంటారని..ఆందోళన అవసరం లేదని బాలయ్య ధైర్యం చెబుతున్నారు.

English summary
Nandamuri Taraka Ratna Shifted to Banglore for better Treatment in last midnight, Balakrishna says Taraka Ratna condition is stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X