తారకరత్న కోరిక తీర్చనున్న భార్య అలేఖ్యారెడ్డి; బాలకృష్ణ చొరవతో త్వరలో చంద్రబాబు కీలక నిర్ణయం?
తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి తారకరత్న కోరిక తీర్చనున్నారని, బాలకృష్ణ చొరవతో త్వరలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
నందమూరి తారకరత్న... రాజకీయాలపై ఎన్నో కలలు కన్నాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న సమయంలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. రాజకీయంగా రాణించకుండానే నందమూరి తారక రత్న అనంత లోకాలకు చేరిపోయాడు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన తారకరత్న నందమూరి కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్ర శోకంలో ముంచి వెళ్లిపోయాడు. అంతేకాదు ఎంతో ఇష్టంగా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డిని ఒంటరిని చేసి తారకరత్న కానరాని తీరాలకు చేరిపోయాడు.

తారకరత్న జ్ఞాపకాలతో క్రుంగిపోతున్న అలేఖ్యా రెడ్డి
అతి చిన్న వయసులోనే నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్టుకు గురై 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు శివరాత్రి రోజున తుది శ్వాస విడిచారు. హీరోగా అనేక సినిమాలు చేసిన ఈ నెంబర్ వన్ కుర్రాడు, రాజకీయాలలో రాణించాలని తహతహలాడాడు. కానీ విధి ఆడిన వింత ఆటలో వచ్చే ఎన్నికలలో పోటీ చేయకుండానే కనుమరుగైపోయాడు. నందమూరి తారకరత్న మరణం తర్వాత ముగ్గురు పిల్లలతో అలేఖ్య రెడ్డి ఒంటరి వారయ్యారు. చుట్టూ ఎందరున్నా, మేమున్నామంటూ ఎంతమంది భరోసా ఇచ్చినా తారకరత్న లేని లోటు అలేఖ్య రెడ్డికి తీరనిది. అలేఖ్య రెడ్డిని తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్న ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కృంగిపోతున్నారు.

అలేఖ్యా రెడ్డిని రాజకీయాల్లో బిజీ చెయ్యాలని భావిస్తున్న బాలకృష్ణ
అయితే అలేఖ్య రెడ్డిని తిరిగి కోలుకునేలా చేయడానికి, ఆమెను బిజీ చేయడానికి రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో పనిచేసి, నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలి, మృత్యువుతో పోరాడి మృతి చెందిన తారకరత్న రాజకీయాల కోరికను అలేఖ్య రెడ్డి ద్వారా తీర్చాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆమెకు కీలక పదవి ఇవ్వాలని, రాజకీయంగా తారకరత్న చేయాలనుకున్న పనులు, అలేఖ్య రెడ్డి ద్వారా చేయించాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల బరిలో అలేఖ్యా రెడ్డి?
ఈ మేరకు ఆయన అలేఖ్య రెడ్డిని రాజకీయంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని నందమూరి కుటుంబంలోనూ, టిడిపి శ్రేణుల్లోను చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయాలని భావించిన నేపథ్యంలో, తారకరత్నకు ఇవ్వాలి అనుకున్న అవకాశాన్ని అలేఖ్య రెడ్డికి ఇవ్వాలని బాలకృష్ణ భావిస్తున్నారని సమాచారం. ఇక ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఆమెకి కీలక పదవి ఇవ్వాలని, వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

చంద్రబాబు అలేఖ్యా రెడ్డికి రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తారా?
నందమూరి తారకరత్న పైన ప్రజల్లో ఉన్న అభిమానం నేపథ్యంలో అలేఖ్య రెడ్డిని కూడా ప్రజలు ఆదరిస్తారని, ఇక ఇదే సమయంలో అలేఖ్య రెడ్డి రాజకీయాలలో బిజీ అయితే కాస్త తారకరత్నలేని బాధనుండి బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని సమాచారం. గతంలో హరికృష్ణ మరణించిన సమయంలో కూకట్ పల్లి ఎన్నికల బరి నుండి నందమూరి సుహాసిని కి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. రాజకీయంగా నందమూరి సుహాసిని ప్రోత్సహించారు. ఇప్పుడు అదే బాటలో అలేఖ్య రెడ్డికి కూడా చంద్రబాబు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తారు అన్న చర్చ జరుగుతుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications