టీడీపీలో అదృష్టం పరీక్షించుకోనున్న నందమూరి తారకరత్న.. రాజకీయాల్లో అయినా సక్సెస్ అవుతారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్న సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నందమూరి తారక రత్న గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ తో భేటీ అయిన ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సై అంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.

తాత పెట్టిన టీడీపీలో అదృష్టం పరీక్షించుకోనున్న తారక రత్న

తాత పెట్టిన టీడీపీలో అదృష్టం పరీక్షించుకోనున్న తారక రత్న


ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన నందమూరి తారకరత్న ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక సినిమా చొప్పున వరుసగా సినిమాలు చేసినా సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో ప్రస్తుతం తాత పెట్టిన తెలుగుదేశం పార్టీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిన నందమూరి తారకరత్న వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ప్రకటించారు. ఇక ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ, తాజా పరిణామాలతో నిజంగానే నందమూరి తారకరత్న రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

లోకేష్ తో భేటీపై చర్చ .. చంద్రబాబు టికెట్ ఇస్తారా?

లోకేష్ తో భేటీపై చర్చ .. చంద్రబాబు టికెట్ ఇస్తారా?

ఇక ఇదే క్రమంలో తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. కుటుంబ విషయాలతో పాటు రాజకీయపరమైన చర్చలు కూడా ఈ భేటీలో ఆయన చేసినట్టుగా సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న వెల్లడించడంతో, ఇదే సమయంలో నారా లోకేష్ ను కలవడంతో ఈ భేటీ పై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తారకరత్న పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చర్చ జరుగుతున్న వేళ, చంద్రబాబు తారకరత్నకు టికెట్ కేటాయిస్తారా? ఏ స్థానంలో చంద్రబాబు తారకరత్నకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తారకరత్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలలో పట్టు ఉంటుంది? వంటి చర్చ ఆసక్తికరంగా మారింది.

టీడీపీలో తారక రత్న టికెట్ సర్దుబాటు అవుతుందా?

టీడీపీలో తారక రత్న టికెట్ సర్దుబాటు అవుతుందా?


తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నేతలు ఉన్న కారణంగా, ఆయనను ఏ నియోజకవర్గంలో చంద్రబాబు సెట్ చేస్తారు అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం. ఎవరైనా నాయకులు యాక్టివ్ గా లేని చోట తారక రత్నకు అవకాశం ఇస్తే అక్కడ ఆయన కొత్తవారు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక టికెట్ విషయంలో చంద్రబాబు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా తాజా పరిణామాలతో ఏపీలో ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి నందమూరి ఫ్యామిలీ అండదండలు ప్రస్తుతం అవసరం అన్న భావన వ్యక్తం అవుతుంది.

 గుడివాడ నుండి తారకరత్న బరిలో ఉంటారా?

గుడివాడ నుండి తారకరత్న బరిలో ఉంటారా?


గుడివాడ నుండి తారకరత్న పోటీ చేస్తారని టాక్ కూడా వినిపిస్తుంది. కొడాలి నాని కి చెక్ పెట్టడానికి నందమూరి కుటుంబం నుండి వారసుడైన తారకరత్నను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కుటుంబం నుండి సంపూర్ణ మద్దతును చంద్రబాబుకు ప్రకటిస్తూ, గత ఎన్నికల సమయంలో కూడా టిడిపి కోసం పనిచేసిన తారకరత్నకు చంద్రబాబు హ్యాండ్ ఇస్తారా? లేక టికెట్ ఇచ్చి బరిలో నిలుపుతారా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో సాగుతున్న ఆసక్తికరమైన చర్చ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+