వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంటిమెంట్ పండుతుందా : టార్గెట్ జ‌గ‌న్ వ‌యా కేసీఆర్‌: బాబు..ప‌వ‌న్ ఇప్పుడే ఎందుకిలా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019: Chandra Babu And Pawan Kalyan Targeted On Jagan Via KCR | Oneindia Telugu

ఏపి ఎన్నిక‌ల ప్రచారం మొత్తం కేసీఆర్ ల‌క్ష్యంగా సాగుతోంది. జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని కేసీఆర్ భుజాన తుపాకి పెట్టి టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుర్తు చే స్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం తెలంగాణ‌నా..పాకిస్థానా అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, ఈ విష‌యాల‌ను ఇప్ప‌టి దాకా ఎందుకు ప్ర‌స్తావించ‌లేదు..ఇబ్బందులు ప‌డుతున్న ఏపి ప్ర‌జ‌ల‌కు చేసిన సాయం ఏంటి..ఎన్నిక‌ల ప్ర‌చారం లోనే వీటిని ఎందుకు ప్ర‌స్తావిస్తున్నారు..ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.

చంద్ర‌బాబు సెంటిమెంట్ అస్త్రం..

చంద్ర‌బాబు సెంటిమెంట్ అస్త్రం..

టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సెంటిమెంట్ నే న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ ఏ విధంగా అయితే వ్య‌వ‌హ‌రించారో అదే రూటులో చంద్ర‌బాబు ప్ర‌చారం సాగుతున్న‌ట్లుగా విశ్లే ష‌కుల అభిప్రాయం. కేసీఆర్ ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల‌ను ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం లో ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ -జ‌గ‌న్ మ‌ధ్య సంబంధాల గురించి ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్ కు ఓటు వేస్తే ఏపి పాల‌న కేసీఆర్ చేతు ల్లోకి వెళ్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తున్నారు. తెలంగాణ లోని ఆంధ్రుల ఆస్తుల‌ను లాక్కుంటున్నార‌ని ఆరోప‌ణ లు చేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఈ విష‌యాల పై చంద్ర‌బాబు ఎందుకు నిల‌దీయ‌లేదు.. ఎక్క‌డా ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల వేళ‌..ఏపి ఆత్మ‌గౌర‌వం గురించి ప్ర‌చార స‌భ‌ల్లో ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం అనే నినాదాన్నే చంద్ర‌బాబు ఎన్నిక‌ల అస్త్రంగా మ‌ల‌చుకున్న‌ట్లు గా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఇది ఎంత వ‌ర‌కు ప్ర‌జ‌ల పై ప్ర‌భావం చూపుతుంద‌నేది చూడాలి

ప‌వ‌న్ సైతం అదే బాట‌లో..

ప‌వ‌న్ సైతం అదే బాట‌లో..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం టిఆర్‌య‌స్‌..జ‌గ‌న్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేసీఆర్ మ‌న వాళ్ల భూము లను తీసేసుకుంటారా అని పవ‌న్ ప్ర‌శ్నిస్తున్నారు. జ‌న‌సేన లోకి వ‌స్తామ‌నే వాళ్ల‌ను అడ్డుకున్నార‌ని ప‌వ‌న్ చెబుతున్నా రు. కేసీఆర్ ను జ‌గ‌న్ త‌ల‌కెత్తుకుంటున్నార‌ని ఆరోపించారు. వైసిపి నేత‌ల‌కు పౌరుషం లేదా..ఆంధ్రా పుట్టుక పుట్ట‌లేదా అంటూ ప‌వ‌న్ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ‌నా..పాకిస్థానా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, వ‌ప‌న్ సైతం చంద్ర‌బా బు బాట‌లోనే..ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసిపి నేత రామ‌చంద్ర‌య్య ఆరోపించారు. రాజ్‌భ‌వ‌న్ లో అట్ హోం లో కేసీఆర్ తో అర‌గంట‌కు పైగా స‌మావేశం అయిన స‌మ‌యంలో..ఈ విష‌యాల పై ఎందుకు ప్రస్తావించ లేదు..గ‌వ‌ర్న‌ర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ల‌లేద‌ని వైసిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, ఏపి ప్ర‌జ‌ల భూముల‌ను తీసే సుకుంటుంటే ప‌వ‌న్ ఎందుకు నిల‌దీయ‌టం లేద‌నే ప్ర‌శ్న వైసిపి నుండి వినిపిస్తోంది.

వైసిపి నేత‌ల ఫోన్ల ట్యాపింగ్‌: డిజిపి తో స‌హా వారిని త‌ప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!వైసిపి నేత‌ల ఫోన్ల ట్యాపింగ్‌: డిజిపి తో స‌హా వారిని త‌ప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!

ఎన్నిక‌ల వేళే..ఎందుకిలా..

ఎన్నిక‌ల వేళే..ఎందుకిలా..

కేసీఆర్ ఏపి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల పై ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే చంద్ర‌బాబు...ప‌వ‌న్ ఎందుకు ప్ర‌స్తావిస్తున్నార‌నే అంశం పై చ‌ర్చ మొద‌లైంది. ఏపి ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా..అవ‌మానం జ‌రి గినా.. ఖ‌చ్చితంగా నిల‌దీయాల్సిందే. అయితే, ఎవ‌రు ఇబ్బందులు ప‌డుతున్నారో వారి స‌మ‌స్య‌ల‌ను ఈ ఇద్ద‌రు నేత లు గ‌వ‌ర్న‌ర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ల‌టం లేదనేది ఇప్పుడు కొంద‌రి ప్ర‌శ్న‌. చంద్ర‌బాబు..వ‌ప‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల పై తెలంగాణ ప్ర‌భుత్వంలోని కీల‌క వ్య‌క్తులు సైతం స్పందించ‌టం లేదు. అదే విధంగా జ‌గ‌న్ సైతం టిఆర్‌య‌స్ తో సం బంధాల పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్ప‌టం లేదు. దీంతో..ఇప్పుడు ఆత్మ‌గౌర‌వం పేరుతో ఎన్నిక‌ల్లో టిడిపి అధినేత చేస్తున్న ప్ర‌చారం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

English summary
TDP chief Chandra Babu and Janasean supremo pawan Kalyan target Jagan via KCR. Chandra babu concentrated in campaign mainly on self respect. Pawan also questioned on KCR comments on AP people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X