
టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య: వైసీపీ టార్గెట్ గా చంద్రబాబు ఫైర్; టీడీపీ నేతల రచ్చ
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు లో టీడీపీకి చెందిన నేత చంద్రయ్యను బుధవారం రాత్రి కత్తులూ కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హతమార్చిన ఘటన తెలుగుదేశం శ్రేణులను ఆవేదనకు గురి చేస్తోంది. ఈనేపథ్యంలో చంద్రయ్య హత్యపై తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రయ్య హత్యపై చంద్రబాబు ధ్వజం
చంద్రయ్య హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసిపి అరాచక పాలన ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. జగన్ రెడ్డి దారుణ పాలనపై తిరగబడుతున్న టిడిపి క్యాడర్ ను, ప్రజలను బయటపెట్టడం కోసం వైసీపీ హత్యాకాండ సాగిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక ఎన్నికల సమయంలో బోండా ఉమా పై బుద్ధా వెంకన్న పై దాడి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.

టీడీపీ నేతలపై దాడులు జరిగినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై జరిగిన దాడులపై చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టి విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి చంద్రబాబు గుండ్లపాడు బయలుదేరారు.
చంద్రయ్య హత్య అధికార పార్టీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ఠ: దేవినేని ఉమా
చంద్రయ్య హత్య పై మండిపడిన దేవినేని ఉమా మాచర్లలో టిడిపి నాయకుడు తోట చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పట్టపగలే నడిరోడ్డుపై గొంతు కోయడం అధికార పార్టీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, పోరాడుతున్న టిడిపి నేతలను అంతమొందించిన మీ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనం కాదా అంటూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
చంద్రయ్య హత్యపై లోకేష్ ఫైర్
చంద్రయ్య హత్యపై జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై, జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో లోకేష్ విరుచుకుపడ్డారు.హత్యా రాజకీయాల వారసుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే వారిపైదాడులు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు. పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.
Recommended Video

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది
గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. అంతేకాదు అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాటం చేయాలన్నారు లోకేష్. చంద్రబాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.