వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్య: ఎమ్మెల్యే పిన్నెల్లి టార్గెట్ గా డీజీపీకి చంద్రబాబు లేఖ

|
Google Oneindia TeluguNews

పల్నాడు జిల్లాలో టిడిపి కార్యకర్త జల్లయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రత్యర్థుల చేతిలో గాయాలపాలైన జల్లయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఇక ప్రత్యర్థుల దాడిలో మరణించిన జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేట లో ఉద్రిక్త వాతావరణం చోటు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

నరసరావుపేటలో ఉద్రిక్తత: జల్లయ్య అంత్యక్రియలకు టీడీపీ నాయకులు, అడ్డుకుంటున్న పోలీసులునరసరావుపేటలో ఉద్రిక్తత: జల్లయ్య అంత్యక్రియలకు టీడీపీ నాయకులు, అడ్డుకుంటున్న పోలీసులు

టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్య... డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్య... డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

జల్లయ్య అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ శ్రేణుల దాడిలోనే జల్లయ్య హత్య జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ సైతం రాశారు. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయన్న చంద్రబాబు

పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయన్న చంద్రబాబు


వైఎస్ఆర్సిపి అనుకూల పోలీసు అధికారుల తీరుతో పల్నాడులో శాంతిభద్రతలు గాడి తప్పాయి అని చంద్రబాబు ఆరోపించారు. 2019లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మారిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. దళితులు,బీసీలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత దాడుల భయంతో వేరే ప్రాంతంలో ఉంటున్న జల్లయ్య ఓ శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో వైయస్సార్ సిపి గుండాలు మారణాయుధాలతో దాడి చేసి జల్లయ్య ప్రాణాలు తీశారని, బక్కయ్య, ఎల్లయ్య ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

పిన్నెల్లి వల్లే ఈ తరహా దాడులు .. చంద్రబాబు ఆరోపణ

పిన్నెల్లి వల్లే ఈ తరహా దాడులు .. చంద్రబాబు ఆరోపణ


పల్నాడు ప్రాంతంలో స్వతంత్రంగా వ్యవహరించే పోలీస్ అధికారుల నియామకం చేపట్టాలని, పల్నాడులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుకూలంగా ఉండే పోలీస్ అధికారుల నియామకం వల్లనే పల్నాడులో పరిస్థితులు గాడి తప్పుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడులో వరుస ఘటనలు పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయని చంద్రబాబు తెలిపారు.

కుటుంబ సభ్యులకు చెప్పకుండా మృతదేహం తరలింపుపై చంద్రబాబు అసహనం

కుటుంబ సభ్యులకు చెప్పకుండా మృతదేహం తరలింపుపై చంద్రబాబు అసహనం


ఇక ఆసుపత్రి నుండి మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు అనేది కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా మృతదేహాన్ని తరలించటంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కవడంతోనే పల్నాడులో హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు చంద్రబాబు. తెలుగుదేశం నేతలు వచ్చేవరకు పోస్టుమార్టం చేయొద్దని వేడుకున్నా లెక్కచేయని పోలీసులు హడావిడిగా జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పకుండా నరసరావు పేట ఏరియా వైద్యశాల నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురంకు తరలించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలన్న చంద్రబాబు

ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలన్న చంద్రబాబు


మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు అనేది కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. మృతునికి సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా బంధువులకు ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని, హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

English summary
Tensions erupted in Narasaraopet over the murder of TDP activist Jallaiah. As a target of MLA Pinnelli, Chandrababu wrote a letter to the DGP asking him to punish the culprits in a special court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X