రాయదుర్గం టిడిపి ఆఫీసులో వీరంగం: విశాఖలో ధర్నా

ఓ కార్యకర్త వాటర్‌ట్యాంక్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. దీపక్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపునకు యత్నించారు. కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖపట్నం లోకసభ స్థానాన్ని మహిళలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నినాదాలు చేస్తూనే మహిళలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం లోకసభ స్థానాన్ని కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాస రావుకు కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications