Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

250 కోట్ల దేవాదాయ భూముల కబ్జాకు బూతుల మంత్రి స్కెచ్ ; టీడీపీ కొత్త రచ్చ, వర్ల లేఖ

కృష్ణా జిల్లా గుడివాడలో రెండు దేవాలయాలకు చెందిన 250 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేయడానికి గడ్డం మంత్రి స్కెచ్ వేశారని తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ దేవుడు భూమికి శటగోపం పెట్టడానికి సదరు మంత్రి సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇక దేవాదాయశాఖ భూములను మంత్రి కబ్జా చేయకుండా కాపాడాలంటూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కు టిడిపి నాయకులు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడకు చెందిన దేవాదాయ శాఖ భూములపై కొడాలి నాని కన్ను పడిందని వారు ఆరోపిస్తున్నారు.

 దేవాదాయ శాఖ కమీషనర్ కు వర్లరామయ్య లేఖ

దేవాదాయ శాఖ కమీషనర్ కు వర్లరామయ్య లేఖ

ఈ మేరకు దేవాదాయ శాఖ కమీషనర్ కు టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య రాసిన లేఖలో కృష్ణాజిల్లా గుడివాడ లోని భీమేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయాలకు పట్టణ శివారులోని సర్వేనెంబర్ 272 లో 15.07 ఎకరాలు, సర్వే నెంబర్ 294 లో 5.4 ఎకరాలు, ఎల్లయ పాడులో సర్వేనెంబర్ 4 లో 4.83 ఎకరాల భూములు ఉన్నాయని పేర్కొన్నారు . 1942 నుండి ఈ భూములు భీమేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాల పరిధిలో ఉన్నాయని గతంలో ఈ భూములను ఆక్రమించుకున్న వారి వద్ద నుండి వాటిని విడిపించి దేవాదాయశాఖ ట్రిబ్యునల్ ద్వారా వీటిని 2017 లో నిషేధిత జాబితాలో చేర్చడం జరిగిందని పేర్కొన్నారు.

 మంత్రి కన్ను దేవాదాయ భూములపై పడ్డాయని ఆరోపణ

మంత్రి కన్ను దేవాదాయ భూములపై పడ్డాయని ఆరోపణ

అయితే ప్రస్తుతం ఈ భూములపై అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి కన్ను పడిందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఒకరిద్దరు అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ దేవాదాయ భూములను మంత్రి ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆ లేఖ ద్వారా వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇక జిల్లాలోని జాయింట్ కలెక్టర్ లలో ఒకరు ఆ మంత్రికి భూములు ధారాదత్తం చేయడానికి ఎంతకైనా బరితెగిస్తున్నారని తెలుస్తోందని వెల్లడించారు. దేవాదాయ శాఖ భూముల కస్టోడియన్ గా ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు.

ప్రభుత్వ పెద్దలకు అధికారులను కూడా జైలుకు పంపే చరిత్ర .. అందుకే విజ్ఞప్తి

ప్రభుత్వ పెద్దలకు అధికారులను కూడా జైలుకు పంపే చరిత్ర .. అందుకే విజ్ఞప్తి

మంత్రి సేవలో తరిస్తున్న అధికారులను కూడా కట్టడి చేసే బాధ్యత మీదే తీసుకోవాలని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. గుడివాడ దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని ఆయన దేవాదాయశాఖ కమిషనర్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ ఈ భూముల విషయంలో జోక్యం కలిగించుకోకుండా ఆ మంత్రి ఆయనకు వత్తాసు పలుకుతున్న జాయింట్ కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులను కూడా జైలుకు తీసుకు వెళ్లే అలవాటు ఈ ప్రభుత్వ పెద్దలకు ఉన్నది కాబట్టి ,తమరు దయచేసి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇక భూములు మంత్రి చేతిలో పడకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ వర్ల రామయ్య దేవాదాయశాఖ కమిషనర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కొడాలి నానీపై ధ్వజమెత్తిన పిల్లి మాణిక్యరావు

కొడాలి నానీపై ధ్వజమెత్తిన పిల్లి మాణిక్యరావు


ఇక గుడివాడ దేవాదాయ భూములను కబ్జా చెయ్యాలని కొడాలి నానీ ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకుడు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేవుడంటే భక్తీ లేదు, భయము లేదని రాష్ట్రమంతా అరాచకాలతో నిండి పోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకాలకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేయడం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం వంటి వాటికి వైసీపీ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని పిల్లి మాణిక్యరావు అన్నారు.

బూతుల మంత్రి భూకబ్జాలు అంటూ ఆరోపణ

బూతుల మంత్రి భూకబ్జాలు అంటూ ఆరోపణ

రాష్ట్రంలో ముఖ్యంగా బూతుల మంత్రి కొడాలి నాని కబ్జాలకు పాల్పడుతున్నారని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొడాలి నానికి దేవుడంటే భయం భక్తి లేవని, మెడలో రుద్రాక్షలతో, విచిత్ర వేషధారణతో దేవుడి మీద భక్తి అని కొందరికి చెబుతూ, కొందరిని భయపెట్టడం కోసమే ఈ విధంగా వేషధారణ చేసుకుంటానని చెప్పుకుంటాడని పిల్లి మాణిక్య రావు ఆరోపించారు. అవసరమైన చోట భక్తి అని, ఇంకొక చోట మాంత్రికుడిని అంటూ చేతబడి వేషాలు వేస్తారని కొడాలి నానిపై పిల్లి మాణిక్య రావు ద్వజమెత్తారు.

25 ఎకరాల దేవాదాయ భూమి కబ్జాకు మంత్రి యత్నం

25 ఎకరాల దేవాదాయ భూమి కబ్జాకు మంత్రి యత్నం

కొడాలి నాని హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, కోట్లాది రూపాయలు బియ్యం దందా ద్వారా డబ్బు దండుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. కొడాలి నాని పేకాట దందాకు కూడా పేరున్న వ్యక్తి అని మండిపడ్డారు. కొడాలి నాని నియోజకవర్గంలో 25 ఎకరాల దేవాదాయ భూముల కబ్జాకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని పిల్లి మాణిక్య రావు మండిపడ్డారు. దేవాదాయ భూములకు సంబంధించి అధికారులను బెదిరిస్తున్నారని, ఎన్వోసీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని పిల్లి మాణిక్య రావు ఆరోపించారు.

Recommended Video

    Tollywood Producers Meets AP minister Perni Nani

    నాని మాటలు వింటే అధికారులు జైలు పాలు.. పిల్లి మాణిక్యరావు ఆగ్రహం


    కొడాలి నాని మాట విని అధికారులు తప్పు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది అంటూ ఆరోపణలు చేశారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కొడాలి నాని కబంధహస్తాల నుండి, గడ్డం మంత్రి వేసిన స్కెచ్ నుండి దేవాదాయశాఖ భూములను కాపాడాలని పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. మొత్తానికి ఏపీలో కొడాలి నాని దేవాదాయ భూములను కబ్జా చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు కొడాలి నానిపై ధ్వజమెత్తారు. జగన్ పాలనలో జరిగే దారుణాలు ఇవే అంటూ విరుచుకుపడుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+